ట్విట్టర్ ద్వారా రామ్ చరణ్ తేజ్ మెరుపు చిత్ర విశేషాలు తెలుసుకోండి..
రామ్ చరణ్ తేజ్ ఆరంజ్ సినిమా ద్వారా ట్విట్టర్ లోకి ప్రవేశించిన మాట అందరికి తెలిసిందే. ఆరెంజ్ సినిమా విడుదల దగ్గరనుంచి తన అభిమానులకు ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేస్తున్నాడు. ఆరంజ్ సినిమా తర్వాత కోంత ఉపశమనం కోసం అల్లు అర్జున్ మరియు ఇతర స్నేహితులు కలసి టూర్ వేసిన విషయం కూడా అందరికి తేలిసిందే. టూర్ నుండి వచ్చిన తర్వాత త్వరలో మొదలవబోతున్న తన కొత్త సినిమా విశేషాలను తన అభిమానలతో ట్విట్టర్ ద్వారా ఈవిధంగా ట్వీట్ చేశారు.
త్వరలో తమిళ డైరెక్టర్ ధరణి దర్శకత్వం లో మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ రూపొందిస్తున్న మెరుపు చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ లోపు తన తదుపరి చిత్రం గురించి కూడా సీరియస్ గా కధలు వింటున్నాడు రామ్ చరణ్. అంతే కాదు ఏ రోజు ఏ కధలు విన్నాడో వాటి గురించి కూడా అభిమానులతో " ట్విట్టర్ లో చర్చిస్తున్నాడు. అభిమానులతో టచ్ లో ఉండటానికి ట్విట్టర్ బాగా ఉపయోగపడుతుందని అంటున్న రామ్ చరణ్ ని "alwayscharan" అనే ఐడి ని ఫాలో అవ్వమని తన అభిమానులను సందేశం పంపారు. ఇలా రామ్ చరణ్ నిఫాలో అవ్వడం వల్ల రామ్ చరణ్ చేసేటటువంటి అన్ని ట్వీట్స్ నిడైరెక్టుగా మీరు తెలుసుకోవడమే కాకుండా రామ్ చరణ్ తేజ్ తోడైరెక్టుగా మాట్లాడే అవకాశం ఉంటుందని అన్నారు.
ప్రస్తుతానికి మెగా హీరో లలో రామ్ చరణ్ తొలి సరిగా ట్విట్టర్ లో ప్రవేశించటం వల్ల అతన్ని ఫాలో అయ్యే అబిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చివరగా రామ్ చరణ్ మెరుపు తో పాటు మరో చిత్రాన్ని సమాంతరంగా చేసే అవకాశం ఉందంటున్న చరణ్ ఆ వివరాలు కూడా ట్విట్టర్ ద్వారా తన అభిమానులకు తెలియచేస్తానని అన్నారు.


Click it and Unblock the Notifications











