twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రెండు రోజల చరణ్ బ్యాచిలర్ పార్టీకి హాజరు కానున్న టాలీవుడ్ సెలబ్రిటీలు..!

    By Sindhu
    |

    నిన్న రాత్రి రాజకీయ, సినీ ప్రముఖుల, బంధుమిత్రుల ఆశీస్సుల నడుమ... అంగరంగ వైభవంగా... కన్నుల పండువగా జరిగిన వేడుకలో తన కాబోయే జీవిత భాగస్వామి ఉపాసన చేతికి ఉంగరాన్ని తొడిగి, వివాహ నిశ్చితార్ధం జరుపుకున్న హీరో రామ్ చరణ్ తేజా, ఈ రోజు రాత్రి తన స్నేహితులకు బ్యాచులర్స్ పార్టీ ఇస్తున్నాడు. ఈ వేడుకను సముద్రపు ఒడ్డున వున్న సుందర నగరం గోవాలో ఏర్పాటు చేస్తున్నాడు.

    ఈ పార్టీ కూడా 'భారీ'గానే మెగా స్థాయికి తగ్గట్టుగానే ఉంటుందని తెలుస్తోంది. రానా, అల్లు అర్జున్, శర్వానంద్, అల్లరి నరేష్, నవదీప్, తమన్నా, త్రిష వంటి సినీ మిత్రులు, చిన్ననాటి మిత్రులూ ఈ పార్టీలో పాల్గొంటారు. ఈ పార్టీ రెండు రోజుల పాటు ఉంటుందని అంటున్నారు. ఇందు కోసం చరణ్, ఉపాసన ఇప్పటికే గోవా బయలుదేరారు.

    ప్రస్తుతం రామ్ చరణ్ రచ్చ చిత్రికరణలో బిజీగా ఉన్నారు. ఆ తరువాతే వివాహ ముహూర్తాన్ని ఖరారు చేస్తారని సమాచారం. పిభ్రవరి చివరిలోగానీ మార్చిలోగాని ముహుర్తం కుదిరే అవకాశం ఉంది.

    English summary
    Ram Charan's Bachelor party in Goa· Ram Charan Tej is gearing up for a party in Goa with a large group of his friends to bid adieu to bachelorhood. A source close to the actor said that stars like Allu Arjun, Rana and Sharwanand will be partying with Charan on the Goa beaches.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X