పెయిన్ కిల్లర్స్ వేసుకుని నటిస్తున్నా: రామ్ చరణ్

By Srikanya

నేను చేస్తున్న ఈ రచ్చ చిత్రం డిఫరెంటుతో కూడిన వాణిజ్యవిలువలున్న సినిమా. డాన్స్‌ చేస్తుండగా గాయాలయ్యాయి. అయినా సినిమా అనుకున్నట్లు రావాలని... పెయిన్‌ కిల్లర్స్‌ వేసుకుని నటిస్తున్నానని రామ్ చరణ్ తేజ అన్నారు. పుట్టిన రోజు సందర్బంగా కలసిన మీడియాతో మట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే ఈ చిత్రం కథ సిటీ నేపథ్యంలో సాగుతుంది. దర్శకుడు చెప్పిన కథ నచ్చి చేస్తున్నా. ఇక బుద్ధుని విగ్రహం దగ్గర 'వాన వానా..' పాట తీయడంలో మహిళాసంఘాలు చేస్తున్న రచ్చపై స్పందిస్తూ... అందులో అసభ్యత లేదనీ అన్నారు. ఈ చిత్రంలో సినిమాటోగ్రాఫర్‌ సమీర్‌ చాలా అందంగా చూపించారని అన్నారు.

రామ్‌చరణ్‌, తమన్నా జంటగా నటిస్తోన్న 'రచ్చ' చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ ఏడెకరాల స్టూడియోలో జరుగుతోంది. హీరోహీరోయిన్లు, పలువురి డాన్సర్లపై ఓ పాటను చిత్రిస్తున్నారు. నేటితో పాటల పూర్తవుతుందనీ, రేపటినుంచి పొల్లాచ్చిలో మరో పాటను చిత్రించనున్నామని మీడియా సమావేశంలో చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఎన్‌.వి. ప్రసాద్‌ తెలియజేశారు. మెగాసూపర్‌గుడ్‌ ఫిలిమ్స్‌ ప్రై.లిమిటెడ్‌ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రానికి ఆర్‌.బి. చౌదరి సమర్పకులు. సంపత్‌నంది దర్శకత్వం వహిస్తున్నారు.ఎన్‌.వి.ప్రసాద్‌ మాట్లాడుతూ, నెలాఖరుతో షఉటింగ్‌ పూర్తవుతుంది. ఇప్పటికే ఆడియోకు మంచి స్పందన లభించింది. సినిమాను ఏప్రిల్‌ 5న విడుదల చేస్తున్నామన్నారు. ఈ రోజు(మంగళవారం) రామచరణ్‌ పుట్టిన రోజు. ఆయనకు ధట్స్ తెలుగు శుభాకాంక్షలు తెలియచేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X