»   » 'రచ్చ'రచ్చగా రామ్ చరణ్ తో బ్రహ్మానందం కామెడీ..!

'రచ్చ'రచ్చగా రామ్ చరణ్ తో బ్రహ్మానందం కామెడీ..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

చాలా కాలం తర్వాత రామ్ చరణ్ తేజ మళ్లీ ఫుల్ స్వింగ్ లో షూటింగులో పాల్గొంటున్నాడు. ఇటీవల ప్రారంభమైన 'రచ్చ' సినిమా షూటింగు హైదరాబాదులో జరుగుతోంది. రెండు రోజుల పాటు గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరించారు. ఇప్పుడు మళ్లీ రెగ్యులర్ సన్నివేశాల షూటింగ్ జరుగుతోంది. రామ్ చరణ్, తమన్నా, బ్రహ్మానందం తదితరులపై కామెడీ సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు.

ఈ సందర్భంగా హీరో రామ్ చరణ్ చెబుతూ, 'షూటింగ్ చాలా బాగా జరుగుతోంది. కామెడీ కింగ్ బ్రహ్మానందం గారితో నటించడం ఎప్పుడూ సరదాగానే వుంటుంది. డైరెక్టర్ సంపత్ నంది బాగా చేస్తున్నాడు' అంటున్నాడు. ఈ సినిమా షూటింగ్ కంటిన్యుస్ గా జరుగుతుంది. మరో పక్క మణిశర్మ సంగీత సారధ్యంలో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరుగుతున్నాయి.

ఇదిలా ఉండగా ఈ చిత్రంలో మరో హీరోయిన్ 'కలర్స్"స్వాతి ఓ కీలక పాత్ర చేస్తోందనే వార్తలు వచ్చాయి. కానీ ఈ సినిమాలో తను నటించడంలేదని, అసలు ఈ యూనిట్ తనని కాంటాక్ట్ చేయలేదని స్వాతి చెప్పారని సమాచారం. కాబట్టి 'రచ్చ" సినిమాలో స్వాతి నటించడంలేదని క్లియర్ అయిపోయింది.

English summary
Ram Charan is currently doing a fight sequence for Sampath Nandi’s Rachcha movie and also a comedy scene with Brahmanandam. Charan tweets 'shoots going GRT!!! its always fun to shoot wit comedy king brahmanandam…. sampath nandi is doing a great job too..'
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu