ఆమె కోసం రామ్ చరణ్

ఇక రామ్ చరణ్ తేజ సరసన దీపికా పడ్కోని ఆల్రెడీ కనిపించింది. అయితే అది సినిమాలో కాదు..ధమ్స్ అప్ సాప్ట్ డ్రింక్ ప్రకటనలో ఈ జంట కనువిందు చేసింది. అప్పట్లో ఈ విషయాన్ని రామ్ చరణ్ తేజ స్వయంగా మీడియాకు చెప్పుతూ చాలా ఎగ్జైట్ ఫీలయ్యారు. తాను దీపిక పడ్కోనే తో నటించడం మంచి ఎక్సపీరియన్స్ అని చెప్పాడు.
అలాగే తాను ఆమె నటించిన ఓం శాంతి ఓం చిత్రాన్ని చూశానాని, పెద్ద ఫ్యాన్ ని అయిపోయానని చెప్పారు. అలాగే ఆమె వర్కింగ్ స్టైల్ బాగ నచ్చింది అంటూ ఆమెను ఆకాశానికెత్తారు. అలాగే ఈ వాణిజ్య ప్రకటన కొరకు కొన్ని గంటల పాటు దీపికతో షూటింగ్ లో పాల్గొనటం కోసం ముంబయి వెళ్ళాను అని చరణ్ ఉద్వేగంగా చెప్పారు. ఆ పరిచయం అప్పుడప్పుడూ ఫోన్స్ ద్వారా బలపడి ఇప్పుడు ఇద్దరి కాంబినేషన్ సెట్ చేసే దాకా వచ్చిందంటున్నారు. ఏదైమైనా ఆ యాడ్ కూడా క్లిక్ అవటంతో ఈ జంటకి క్రేజ్ వచ్చింది. దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి అన్నమాట అని సీనియర్స్ అంటున్నారు.


Click it and Unblock the Notifications











