చేసింది ఒక్క సినిమా అయినా అందరికి నోట్ అయి యూత్ లో నోళ్ళలో నానుతున్న హీరో రామ్ చరణ్ తేజ.అలాగే మెదటి సినిమా (తొలి ప్రేమ) ని పవన్ కళ్యాణ్ తో చేసి మెగా హిట్ కొట్టి క్రేజ్ సంపాదించిన దర్శకుడు కరుణాకరన్.తాజాగా వారిద్దరు కాంబినేషన్ లో కొత్త సినిమాకు అంకురార్పణ జరిగే అవకాశాలు కనపడుతోంది. కరుణాకరన్ కొత్తవారితో చేస్తున్న సినిమా ఉల్లాసంగా ...ఉత్సాహంగా ఆడియో ఫంక్షన్ కి అటెండ్ అయిన రామ్ చరణ్ అతనితో సినిమా చేస్తానంటూ అక్కడ ప్రకటించాడు. ఈ సినిమా వచ్చే సంవత్సరం ప్రారంభమవ్వచ్చంటున్నారు.బన్నీ తో హ్యాపి చేసిన కరుణాకర్ రామ్ చరణ్ తో కూడా చేస్తే మరో సారి చిరు కుటుంబంలో పనిచేస్తున్నట్లు అవుతుంది.అతను ఇప్పటి వరకు చేసినవన్నీ లవ్ స్టోరీలే. దాంతో మాస్ ఇమేజ్ తో వస్తున్న చరణ్ తో ఎలాంటి కథ చేస్తోడని అభిమానులు ఆసక్తి చూపుతున్నారు.ప్రస్తుతం చిరుత పునర్జన్మల చుట్టూ తిరిగే రాజమౌళి సినిమాలో బిజీగా ఉన్నాడు.
Story first published: Sunday, May 17, 2026, 5:32 [IST]