twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నూర్ మహ్మద్ కుటుంబానికి రామ్ చరణ్ సహాయం.. మాట నిలబెట్టుకున్న మెగా పవర్‌స్టార్

    |

    టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ ఎంత ప్రత్యేకమో.. అభిమానుల్లో మెగా ఫ్యాన్స్‌ది అంతే ప్రత్యేకమైన స్థానం. దాదాపు నలభై యేళ్ల పాటు చిరంజీవి అభిమానిగా, చిరు అభిమాన సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నో సేవలందించిన మెగా అభిమాని నూర్ మహ్మద్. అంతటి చిరు అభిమాని.. ఆ మధ్య ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన మృతికి మెగా హీరోలంతా సంతాపాన్ని తెలిపారు.

    అప్‌డేట్స్ ఆపేసిన బన్నీ..

    అప్‌డేట్స్ ఆపేసిన బన్నీ..


    నూర్ మహ్మద్ మరణ వార్త తెలిసిన వెంటనే.. అల వైకుంఠపురములో అప్‌డేట్స్‌ను ఆపేశారు. ఆ రోజే ఓ పాటకు సంబంధించిన అప్‌డేట్ ప్రకటిస్తామని తెలిపారు. అయితే మెగా అభిమాని మృతితో తాము కలత చెందామని అందుకే అప్‌డేట్‌ను వాయిదా వేస్తున్నామని ప్రకటించారు.

    పరామర్శించిన చిరు, బన్నీ..

    పరామర్శించిన చిరు, బన్నీ..

    నూర్ మహ్మద్ అంటే మెగా ఫ్యామిలీకి ఎంతో ప్రత్యేకం. ఆయన మరణవార్త తెలియగానే మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ హుటాహుటిని వారి నివాసానిని చేరుకుని నూర్ మృతదేహానికి నివాళులు అర్పించి.. ఆయన కుటుంబాన్ని ఓదార్చారు. ఆర్థిక సహాయం చేస్తామని రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా మాటిచ్చాడు.

    సోషల్ మీడియాలో స్పందించిన హీరోలు..

    సోషల్ మీడియాలో స్పందించిన హీరోలు..

    తమ అభిమాని మృతి చెందడంతో మెగా హీరోలైన సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, రామ్ చరణ్ వంటి వారు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మెగా ఫ్యామిలీలో ఓ వ్యక్తిని కోల్పోయామని ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటానని రామ్ చరణ్ ప్రకటించాడు.

    మాట నిలబెట్టుకున్న చెర్రీ..

    మాట నిలబెట్టుకున్న చెర్రీ..

    ఆ నాడు ఇచ్చిన మాటను రామ్ చరణ్ ఈనాడు నిలబెట్టుకున్నాడు. నూర్ ఫ్యామిలీని ఇంటికి పిలిచి, కాసేపు ముచ్చటించిన అనంతరం రామ్ చరణ్... రూ. 10లక్షల చెక్‌ను అందజేశాడు. ప్రస్తుతం వీటికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

    English summary
    Ram Charan Donated Ten Lakshs To Noor Family. Mega Heroes Condolence To Fan Noor Mohammed. Fans are family. will truly miss our beloved family member Noor Mohammad Ji. His positivity & helping nature set a benchmark for the young generation. May you rest in peace.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X