ధృవ జ్ఞాపకాల్లో రామ్ చరణ్.. కానీ అప్పటి వరకు అలాగే ఉండడన్న చెర్రీ
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా దెబ్బకు లక్షల మంది పిట్టల్లా రాలిపోతున్నారు. మన దేశంలోనూ కరోనా తాండవం చేస్తోంది. కరోనా వైరస్ కట్టడి కోసం లాక్‌డౌన్‌ను అమలు పర్చినా ఎటువంటి ప్రయోజనం కనిపించడంలేదు. ప్రజలంతా ఇంటి పట్టునే ఉంటున్నారు. స్టార్ హీరోల నుంచి సామాన్యజనాల వరకు అంతా ఇంట్లోనే ఉంటున్నారు. క్షణం తీరిక లేకుండా బిజీగా గడిపే స్టార్స్ ప్రస్తుతం.. ఇంటి పట్టునే ఉంటూ ఫ్యామిలీతో సమయాన్ని గడిపేస్తున్నారు.
అయితే స్టార్స్ అంతా షూటింగ్స్‌తో సందడి సందడిగా గడిపే క్షణాలు దూరమయ్యాయి. నిత్యం లొకేషన్స్‌లో కొన్ని వందల మంది మధ్య ఉండే హీరోలు ప్రస్తుతం ఇంటి నాలుగ గోడల మధ్యే ఉంటున్నారు. కొంత మంది వర్కౌట్లు, మరికొంత మంది ఫ్యామిలీతో గడుపుతూ కాలక్షేపం చేస్తుంటే ఇంకొంత మంది మాత్రం.. షూటింగ్స్ ఎప్పుడెప్పుడా అని ఎదరుచూస్తున్నారు. ఈ జాబితాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేరిపోయాడు. నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉన్నాడు.

ధృవ షూటింగ్ సమయంలో గడిపిన క్షణాలను, సాంగ్ షూట్‌లో భాగంగా సరదాగా గడిపిన సంగతులను గుర్తు చేసుకుంటూ కొన్నిఫోటోలను షేర్ చేశాడు. ఈ మేరకు పోస్ట్ చేస్తూ.. ధృవ షూటింగ్ నాటి పిక్స్.. మళ్లీ సెట్‌పైకి వెళ్లేందుకు ఎంతో ఆత్రుతగా ఉన్నా.. కానీ అప్పటి వరకు ఇంట్లోనే ఉండండి.. క్షేమంగా ఉండండని చెప్పుకొచ్చాడు. ఈ పోస్ట్‌కు రకుల్ కామెంట్ చేస్తూ.. ఆ సమయంలో మనమెంతో ఎంజాయ్ చేశామని తెలిపింది.


Click it and Unblock the Notifications











