కంగారుపడకండి...ఇవేమీ ఒరిజనల్ టైటిల్స్ కాదు. వియన్ ఆదిత్య నిర్మించి దర్శకత్వం వహించిన రెయిన్ బొ చిత్రంలో ఈ టైటిల్స్ తో ఈ హీరోలని కలిపి పోస్టర్స్ వేసి చూపారు.అంత అవసరమెందుకొచ్చిందీ అంటే కథ ప్రకారం హీరోయిన్ సోనాలీ చౌహాన్ ఆమె పాత్ర పరంగా ఓ పెద్ద హీరోయిన్ అవ్వాలనే లక్ష్యంతో హైదరాబాద్ వచ్చి రాజమౌళి సినిమాలో ఛాన్స్ సంపాదిస్తుంది. దాంతో ఆమె తెలుగులో బిజీ హీరోయిన్ అయి పోతుంది. ఎడా పెడా అవకాశాలు వచ్చిపడతాయి. ఎన్టీఆర్ తో అగ్నినక్షిత్రం, మహేష్ బాబు తో వారధి, పవన్ కళ్యాణ్ తో పవర్, చరణ్ తేజ తో వేగం అంటూ చిత్రాలు చేసేసి నట్లు చూపుతారు. ఆ సన్నివేశాలు పండటం కోసం ఈ పోస్టర్స్ డిజైన్ చేసారు. అయితే ఆ టైటిల్స్ తో ఆ హీరోలతో వియన్ ఆదిత్యకు చిత్రాలు చేయాలని ఉంది. అది ఈ రకంగా బయిటపెట్టుకున్నాడని కొందరు కామెంట్ చేస్తూండటం గమనార్హం.