ప్రధాని నరేంద్ర మోడీతో వేదిక పంచుకోనున్న రాంచరణ్.. ఆ ఈవెంట్ కోసం ప్రత్యేక ఆహ్వానం!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రేంజ్ అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇటీవల RRR సినిమాకు సంబంధించిన సాంగ్ ఆస్కార్ అవార్డును గెలుచుకోవడంతో రామ్ చరణ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ మరింత క్రేజ్ అందుకున్నారు. అయితే ముందుగానే రామ్ చరణ్ హాలీవుడ్ మీడియాలో కూడా హైలైట్ అవుతూ వచ్చాడు.

ఇదివరకే గోల్డెన్ గ్లొబ్ అవార్డు కూడా రావడంతో వారికి హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి క్రేజ్ దక్కింది. అయితే ఇప్పుడు రామ్ చరణ్ తేజ్ భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాల్గొనబోతున్న ఒక వేడుకలో కూడా ముఖ్యఅతిథిగా పాల్గొనబోతున్నాడు. అందుకు సంబంధించిన వార్తలు కూడా ప్రస్తుతం నేషనల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Ram Charan to Participate in India Today Conclave Alongside PM Modi

ఇండియా టుడే కాంక్లేవ్ సమ్మిట్ ఈ నెల 17, 18 తేదీల్లో జరగనుంది. ఇక సచిన్ టెండూల్కర్ సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యే ఆ సమ్మిట్ లో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా రానున్నారు. ఇక రామ్ చరణ్ కూడా ఆ వేడుకలో మోడీతో కలిసి స్టేజ్ షేర్ చేసుకోబోతున్నాడు. అంతే కాకుండా ఆ వేడుకలో రామ్ చరణ్ కు ప్రసంగించే అవకాశం కూడా కల్పిస్తున్నారు.

ఈ సమ్మిట్‌తో పాటు దేశంలోని వివిధ రంగాలకు చెందిన దిగ్గజాలు పాల్గొనే హిందూస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో కూడా రామ్ చరణ్ పాల్గొనబోతున్నారు.మొత్తంమీద ఇటీవలి రామ్ చరణ్ హాలీవుడ్ క్రిటిక్ అవార్డు వేడుకలో అలాగే ఆస్కార్ స్టేజ్‌లలో కనిపించినప్పటి నుండి దేశవ్యాప్తంగా అతని పాపులారిటీ పెరిగింది. ఇక రాబోయే రోజుల్లో అతని రేంజ్ మరింత పెరగబోతోంది. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా 2024 సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X