సైరాపై మెగా ఫ్యాన్స్ అసంతృప్తి.. అందరి చూపు రాంచరణ్‌పైనే!

భారతీయ సినీ చరిత్రలోనే మెగా ప్రాజెక్టు రిలీజ్‌కు సిద్దమవుతున్నది. దేశంలోని అన్ని భాషల ప్రేక్షకులు ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా రిలీజ్‌కు ముస్తాబవుతున్నది. ఇప్పటి వరకు ఓ టీజర్, ట్రైలర్ మినహా పెద్దగా ప్రమోషన్ చేపట్టలేదు. అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో అగ్రెసివ్‌గా ఎక్కడా ప్రచారం కనిపించడం లేదనే మాట సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. అయితే ఈ వ్యవహారంపై మెగా ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారనేది కాదనలేని వాస్తవం. ఇంతకు మెగా అభిమానుల అసంతృప్తికి కారణమేమిటంటే..

 మెగా ఫ్యాన్స్ ఉత్సాహంపై

మెగా ఫ్యాన్స్ ఉత్సాహంపై

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత రెండేళ్ల నుంచి మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తితో సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. సైరా ప్రాజెక్ట్ అనౌన్స్ కావడంతో అభిమానుల్లో ఉత్సాహం ఉరకలు వేసింది. ఇక సినిమా రిలీజ్‌కు డేట్ దగ్గర పడుతున్న కొద్ది వారిలో టెన్షన్ పెరిగింది. ఆగస్టు 22న రిలీజైన ట్రైలర్‌తో ఫ్యాన్స్‌లో అభిమానం కట్టలు తెంచుకొన్నది.

Recommended Video

Sye Raa Narasimha Reddy Total Business || 'సైరా' బంపర్ ఆఫర్ |
సోషల్ మీడియాలో నెటిజన్లు ఆందోళన

సోషల్ మీడియాలో నెటిజన్లు ఆందోళన

ఇక చిరంజీవి సినిమా అంటే ప్రమోషన్స్, ప్రచార పోస్టర్ల ఝలక్‌లను అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆశిస్తారు. అయితే పట్టుమని 15 రోజులు లేకపోవడంతో సినిమా ప్రమోషన్‌లో ఎలాంటి కదలిక కనిపించకపోవడంపై అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియాలో తనదైన శైలిలో స్పందిస్తున్నారు. రాంచరణ్ స్ట్రాటజీ ఎంటో అర్ధం కాక తలబాదుకొంటున్నారు.

కనివినీ ఎరుగని విధంగా

కనివినీ ఎరుగని విధంగా

ఇక సైరా ప్రీ రిలీజ్ ఫంక్షన్ సెప్టెంబర్ 18న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కనివినీ ఎరుగని రీతిలో జరుపనున్నారు. ఈ వేడుక కోసం పవన్ కల్యాణ్, కొరటాల శివ, రాజమౌళి, వీవీ వినాయక్ తదితరులు హాజరుకానున్నారు. అయితే ఈ వేడుక తర్వాతనే అసలు ప్రమోషన్‌ను దద్దరిల్లేలా చేపట్టేందుకు నిర్మాత రాంచరణ్ ప్లాన్ చేసినట్టు యూనిట్ వెల్లడిస్తున్నది.

 రికార్డుస్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్

రికార్డుస్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్

ఇక సైరా నర్సింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రి రిలీజ్ వరల్డ్ వైడ్‌గా రూ.190 కోట్లకుపైగా జరిగినట్టు తెలిసింది. ఓ తెలుగు సినిమా విషయానికి వస్తే.. ఇదే అత్యుత్తమ రికార్డ్ అని చెప్పుకొంటున్నారు.

భారీ తారాగణంతో సైరా

భారీ తారాగణంతో సైరా

ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్న సైరా చిత్రంలో ఎంతో మంది దిగ్గజ నటులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. బిగ్ బీ అమితాబ్, మక్కల్ సెల్వం విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, లేడీ సూపర్ స్టార్ నయనతార, తమన్నా, జగపతి బాబు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ మూవీకి రత్నవేలు సినిమాటోగ్రఫర్ గా పనిచేస్తున్నారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X