విదేశీ భామతో రాంచరణ్ రొమాన్స్.. అదరగొట్టేలా శంకర్ ప్యాన్ వరల్డ్ మూవీ ప్లానింగ్
సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్‌లో సినిమా అనే వార్త దక్షిణాది సినిమా పరిశ్రమంలో సంచలనం రేపింది. ఈ రేర్ కాంబినేషన్ గురించి ప్రకటన వెలువడగానే సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. భారీ రేంజ్‌లో రూపొందే ఈ సినిమా గురించి అప్పుడే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ వివరాల్లోకి..

శంకర్, రాంచరణ్ కాంబినేషన్‌లో
దర్శకుడు శంకర్, రాంచరణ్ కలయికలో వచ్చే సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా రూపొందించనున్నారు. భారీ బడ్జెట్ రూపొందే ఈ సినిమా వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు.
బీచ్‌లో యువ హీరోయిన్ హంగామా... అందంతో ఆకట్టుకొంటున్న శాన్వీ శ్రీవాస్తవ

రేర్ కాంబినేషన్ అంటూ చిరంజీవి ప్రశంసలు
శంకర్, రాంచరణ్ కాంబినేషన్‌లో వచ్చే సినిమాపై మెగాస్టార్ చిరంజీవి కూడా తన స్పందన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో చిరంజీవి రియాక్ట్ అవుతూ.. ఓ రేర్ కాంబినేషన్.. ఇది హిస్టారిక్ మూమెంట్‌గా మారడం ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

రాంచరణ్‌తో సుజీ బే రొమాన్స్
అయితే ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న శంకర్ సినిమాలో సౌత్ కోరియాకు చెందిన హీరోయిన్ నటిస్తున్నారనే విషయం చర్చనీయాంశమైంది. ఈ చిత్రంలో సుజీ బే అనే నటిని రంగంలోకి దించుతున్నారు. ఆమె ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నారనే వార్త ఇప్పుడు దక్షిణాది ఇండస్ట్రీలో స్పెషల్‌గా మారింది.

ప్యాన్ ఇండియా మూవీగా
ఇక తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రూపొందే ఈ సినిమాకు మరో ప్రత్యేకత ఉంది. తొలిసారి శంకర్ ఓ తెలుగు హీరోను డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం ప్యాన్ ఇండియా వైడ్‌గానే కాకుండా ఇతర భాషల్లో రిలీజ్ చేసే ఆలోచన కూడా చేస్తున్నట్టు సమాచారం. అందుకే సుజీ బేను రంగంలోకి దించినట్టు తెలుస్తున్నది.


Click it and Unblock the Notifications











