Upasana Konidela కోసం వరల్డ్ క్లాస్ గైనకాలజిస్టు.. భార్య డెలివరీ విషయంలో రాంచరణ్‌కు అలాంటి ఆందోళన!
మెగా పవర్ స్టార్ రాంచరణ్ అమెరికాలో పలు కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. మరో పక్క తన భార్య ప్రెగ్నెంట్ కావడంతో ఆమె యోగా క్షేమాల కోసం సమయాన్ని వెచ్చిస్తూ జాగ్రత్తలు తీసుకొంటున్నారు. రాంచరణ్ సతీమణి ఉపాసన కొద్ది నెలల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వడానికి సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పరిస్థితుల్లో ఆస్కార్ అవార్డుల వేడుక కోసం రాంచరణ్ ఎక్కువగా విదేశాల్లో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో ప్రపంచంలోనే పేరున్న గైనాకాలజిస్టు జెన్నిఫర్ ఆష్టన్ సహాయాన్ని తీసుకోవడానికి సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఉపాసన కొణిదెల చేసిన ఆసక్తికరమైన ట్వీట్ వివరాల్లోకి వెళితే...

గుడ్ మార్నింగ్ అమెరికా టాక్ షోలో
యూఎస్‌లో పాపులర్ టాక్ షో గుడ్ మార్నింగ్ అమెరికాలో యాంకర్లతోపాటు వరల్డ్ క్లాస్ గైనకాలజిస్ట్ జెన్నిఫర్ ఆష్టన్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా సమయంలో ప్రెగ్నెంట్‌గా ఉన్న ఉపాసన కొణిదల ప్రస్తావన వచ్చింది. త్వరలోనే తండ్రి కాబోతున్నారు.. మీకు ఎలాంటి ఆందోళనతో ఉన్నారు అనే ప్రశ్నకు సమాధానమిస్తూ... ఇప్పటి వరకు మేము సంతానం కోసం ప్లాన్ చేయలేదు. త్వరలోనే మేము ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నాం. కానీ ఇప్పుడు నేను రకరకాల పనుల వల్ల చాలా దేశాలు తిరుగాల్సిన పరిస్థితి ఏర్పడింది అని రాంచరణ్ చెప్పారు.
వరల్డ్ క్లాస్ గైనకాలజిస్టుతో
గుడ్ మార్నింగ్ అమెరికా టాక్ షోలో ఉపాసన ప్రస్తావన రావడంతో అమెరికాలోని వరల్డ్ క్లాస్ గైనకాలజిస్టు జెన్నిఫర్ ఆష్టన్‌కు రిక్వెస్ట్ చేస్తూ తన భార్యకు సహాయం చేయాల్సిందిగా అభ్యర్థించారు. తమతో కలిసి పలుదేశాల్లో పర్యటించేందుకు సిద్దమైతే అంతకంటే గొప్ప విషయం మరోటి లేదని రాంచరణ్ అన్నారు. దాంతో తప్పకుండా నేను మీతో కలిసి ప్రయాణిస్తాను. ఆ విషయాలు తర్వాత వివరంగా మాట్లాడుకొందాం అని జెన్నీ అన్నారు. దాంతో మీరు ఈ షోకు రావడం యాదృచ్ఛికమైనప్పటికీ.. మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది అని రాంచరణ్ అన్నారు

మా హాస్పిటల్‌లో సేవలందించండి
రాంచరణ్ అభ్యర్థన తర్వాత ఉపాసన స్పందిస్తూ.. జెన్నీఫర్ ఆష్టన్‌కు థ్యాంక్యూ చెబుతూ పోస్టు పెట్టారు. వీలైతే నాకోసం, నా డెలివరీ కోసం హైదరాబాద్‌లోని మా ఫ్యామిలీ హాస్పిటల్‌లో సేవలు అందించాలి. ఒకవేళ మీరు నిర్ణయం తీసుకొంటే గొప్పగా ఉంటుంది. మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తుంటాం అని ఉపాసన కోరారు.

రాంచరణ్ ఫ్యాన్స్‌కు థ్యాంక్స్
ఉపాసన ట్విట్టర్‌లో పోస్టు పెడుతూ.. డాక్టర్ జెన్ ఆష్టన్ మీరు ఎంతో గొప్ప హృదయం కలవారు. మిమ్మల్ని కలుసుకోవడానికి ఎదురు చూస్తున్నాం. మీరు డాక్టర్ సుమన మనోహర్, డాక్టర్ రూమా సిన్హాతో కలిసి ఇండియాలోని అపోలో హాస్పిటల్‌లో జాయిన్ అవ్వాలని కోరుకొంటున్నాం. గుడ్ మార్నింగ్ అమెరికా ప్రేక్షకులకు, రాంచరణ్ ఫ్యాన్స్, శ్రేయోభిలాషులకు నా ధన్యవాదాలు అంటూ ఉపాసన ట్వీట్‌లో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











