పిఠాపురంలో తల్లి సురేఖతో రాంచరణ్.. ఆ హీరోల ఫ్యాన్స్‌తో సీక్రెట్ మీటింగ్!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. ఎన్నికల ప్రచారానికి కొన్ని గంటల గడువు ఉండటంతో రాజకీయ పార్టీల నేతలంతా ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో సినీ తారలు కూడా తమకు తోచిన విధంగా తమకు నచ్చిన పార్టీలకు మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలో అందరి దృష్టి పిఠాపురంపైనే పండింది. ఎందుకంటే అక్కడ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పోటీ చేస్తుండమే.. అయితే తన బాబాయ్‌కు మద్దతుగా తన తల్లి సురేఖ కొణిదెలతో కలిసి మెగా పవర్ స్టార్ రాంచరణ్ పిఠాపురానికి చేరుకొన్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
ఆంధ్రాలో అధ్యాత్మిక కేంద్ర పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా అక్కడ ఉన్న దేవాలయానికి అత్యంత పేరు ప్రతిష్టలు వస్తున్నాయి. ఇప్పటి వరకు కొంత మందికే తెలిసిన ఈ పట్టణానికి ప్రజలు, మెగా అభిమానులు పోటెత్తుతున్నారు. దాంతో ఈ పట్టణం ప్రచారం, భక్తులతో కళకళలాడుతున్నది.

ఇక ప్రచారం సమయానికి ముగింపు దగ్గరపడుతుండటంతో మెగా పవర్ స్టార్ రాంచరణ్ పిఠాపురంలోని కుకుటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొనేందుకు తన తల్లి సురేఖతో శనివారం ప్రత్యేక విమానంలో ఉదయం రాజమండ్రికి చేరుకొన్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఆయన పిఠాపురం చేరుకొంటారు. రాజమండ్రి విమానాశ్రయంలో రాంచరణ్‌కు భారీ స్వాగతం లభించింది. మెగా అభిమానులు పొటేత్తారు.
కుకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పార్థనలు చేసిన తర్వాత ఆయన తన అభిమానులు, మెగా, పవర్ స్టార్ అభిమానులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. అనంతరం సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు చేరుకొంటారని ఆయన సన్నిహితులు, పీఆర్ వర్గాలు వెల్లడించాయి.

ఇక జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ మీద తన అభిమానాన్ని, ప్రేమను మరోసారి ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ చాటుకున్నారు . మీరు ఎంచుకున్న నిస్వార్థమైన మీదారిని.. ప్రజల సేవలకు మీ జీవితాన్ని అంకితం చేసిన విధానం చూసి నేను ఎప్పూడు గర్వపడుతుంటాను. మీ కుటుంబ సభ్యుడిగా, నా ప్రేమ, మద్దతు మీతో ఎప్పుడూ వుంటాయి. మీ రాజకీయ ప్రస్థానంలో మీరు కోరుకున్నవి అన్నీ సాకారం కావాలని, మీ రాజకీయ ప్రయాణం విజయకేతనం ఎగురవేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను' అంటూ తన సోషల్ మీడియా వేదికగా జనసేనాని పవన్‌కల్యాణ్‌కు తన మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











