లోకల్ హృతిక్ రామ్ చరణ్

అలాగే ఫునర్జన్మ నేపధ్యంలో తయారవుతున్న ఈ చిత్రం సమ్మర్ కి రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు దర్శక,నిర్మాతలు. అలాగే రాజమౌళి కూడా తనకు ఎన్టీఆర్ ఇచ్చిన జక్కన అనే బిరుదును నిలబెట్టుకునే ప్రయత్నంలో బాగా సినిమాను చెక్కుతున్నాడని సమాచారం. ఇక ఈ సినిమాలో చరణ్ ప్రక్కన కాజల్ నటిస్తోంది. శ్రీహరి ఓ ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నాడు. నాలుగు వందల ఏళ్ళ క్రిందట రాజస్ధాన్ లో మొదలయ్యే ఈ కథలో చరణ్,కజల్ అప్పట్లో ప్రేమించుకుంటారని అయితే శ్రీహరి అప్పుడు విడిస్తాడు. అయితే తర్వాత జన్మలో వీళ్ళిద్దరిని కలపటానికి అతనే ప్రయత్నం చేస్తాడు.
ఇక ఈ సినిమాలో చిరంజీవి తన కుమారుడుతో పాటు బంగారు కోడిపెట్ట సాంగ్ లో స్టెప్స్ వేసాడు. అవి స్పెషల్ క్రేజ్ ని సృష్టించనుంది. అంతేగాక ఆ మధ్య నెట్ లో రిలీజయిన ఈ చిత్రం క్లిప్పింగ్స్ కూడా చాలా బాగుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడుతున్నాయి. ఇక ఈ సినిమా మంచి విజయం సాధిస్తే మిగతా హీరోలు కూడా తమ వయస్సుకు తగ్గ బాలివుడ్ లేక హాలివుడ్ హీరోని ఎంపిక చేసుకుని అనుకరిస్తారేమో చూడాలి.


Click it and Unblock the Notifications











