జంజీర్ : రామ్ చరణ్ ట్రైనింగ్ అయ్యాడిలా...

By Bojja Kumar

హైదరాబాద్ : టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ జంజీర్ చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు కేవలం సౌతిండియాకే పరిచయం అయిన రామ్ చరణ్ 'జంజీర్' చిత్రం ద్వారా నార్త్ ఇండియాసినీ పరిశ్రమలోనూ అడుగు పెట్టబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆలిండియా హీరో కాబోతున్నాడు.

మరి రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ ఎలాంటి ఫలితాలను ఇస్తుంది? ఆయన భవిష్యత్ ఎలా ఉండబోతోంది అనేది జంజీర్ సినిమా ఇచ్చే ఫలితాల మీదనే ఆధార పడి ఉంటుందని చెప్పక తప్పదు. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించడం కోసం చాలానే కష్ట పడ్డాడు చరణ్. జంజీర్ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న చరణ్ తన ఫిజిక్‌ని అందుకు తగిన విధంగా మార్చుకునేందుకు ఆస్ట్రేలియన్ ఫిట్ నెస్ ఎక్స్ పర్ట్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్నాడు.

'జంజీర్' చిత్రం సెప్టెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగులో 'తుఫాన్' పేరుతో ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. సినిమాలో ఓ యాక్షన్ సీన్ చిత్రీకరణ కోసం నిర్మాతలు దాదాపు రూ. 2 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.

రామ్ చరణ్, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న ఈచిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. వాస్తవానికి ఈచిత్రం వేసవిలోనే విడుదల కావాల్సి ఉండగా ఈ చిత్ర నిర్మాతలు న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కోవడంతో సినిమా విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ చిత్రానికి సంబంధించిన లీగల్ సమస్యలు ఓ కొలిక్కి రావడంతో సినిమాను సెప్టెంబర్ 06న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

'జంజీర్' ఎవరూ ఊహించని రేంజిలో రికార్డు స్థాయి రేటుకు అమ్ముడు పోయింది. ఈచిత్రం డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ రూ. 105 కోట్లు కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్‌ సినిమాలకు తెలుగులో దాదాపు రూ. 50 కోట్లకు పైగా వసూలు చేసే స్టామినా ఉండటం, ఇతర దక్షిణాది రాష్ట్రాల్లోనే ఆయన సినిమాలకు మంచి మార్కెట్ ఉండటంతో పాటు, హిందీ మార్కెట్లో 'జంజీర్' చిత్రం అవలీలగా 80 కోట్లపైగానే వసూలు చేసే అవకాశం ఉండటంతో వంద కోట్లకు పైగా భారీ మొత్తానికి వెచ్చింది జంజీర్ చిత్రం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ రిలయన్స్ సంస్థ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. తెలుగులో జంజీర్ చిత్రాన్ని 'తుఫాన్' పేరుతో, మళయాలంలో 'ముంబై కా హీరో' పేరుతో విడుదల చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X