2012 సంవత్సరానికి ట్రిపుల్ బొనాంజా..చరణ్ క్యాలెండర్ ఫుల్..!?
రామ్ చరణ్, తమన్నా జంటగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'రచ్చ". ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ చైనాలో జరుగుతోంది. కాగా ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయానలనుకున్నారు. ప్రస్తుతం మాత్రం ఈ సినిమా సంక్రాంతికి విడుదలవ్వడంలేదని తెలుస్తోంది. ఫిబ్రవరిలో మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమాని విడుదల చేయలానుకుంటున్నారని సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు సంక్రాంతి నాటికి పూర్తయ్యే అవకాశంలేదని భావించే ఈ యూనిట్ రచ్చ" విడుదలను వాయిదా వేసిందని వినికిడి.
కాగా రామ్ చరణ్ తేజ్ చిత్ర సీమకు పరిచయమై గత సెప్టెంబరుకు నాలుగేళ్ళు పూర్తయింది. ఈ నాలుగేళ్ళలో కేవలం చరణ్ నటించిన చిత్రాలు కేవలం మూడు మాత్రమే విడుదలయ్యాయి. తన మొదటి చిత్రం 'చిరుత" తర్వాత దాదాపు రెండు సంవత్సరాల విరామం తీసుకుని వచ్చిన 'మగధీర" వంటి సూపర్ హిట్ తర్వాత కూడా చరణ్ తన చిత్రాల ఎంపిక విషయంలో నెమ్మది వ్యవహరించిన 2010 లో వచ్చిన 'ఆరెంజ్" బాక్సాఫీసు వద్ద విఫలం చెందడంతో వరుస చిత్రాలతో ముందుకు వస్తానని అభిమానులకు మాట ఇచ్చాడు.
ఆ క్రమంలోనే తమిళ దర్శకుడు ధరణి దర్శకత్వంలో 'మెరుపు", సంపత్ నంది దర్శకత్వంలో 'రచ్చ" చిత్రాలను అంగీకరించాడు. చరణ్, కాజల్ అగర్వాల్ కాంబినేషన్ లో మొదలైన 'మెరుపు" చిత్రం కొన్ని కారణాలవల్ల అర్ధంతరంగా ఆగిపోయింది. వెంటనే 'రచ్చ" చిత్రీకరణకు తన కాల్షీట్లను సర్దుబాటు చేసిన చరణ్ శరవేగంగా ఆ చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నాడు.
రచ్చ చిత్రం 2012 ఫిబ్రవరిలో విడుదలవుతుండగా, ఈ మధ్యనే వి.వి.వినాయక్ దర్శకత్వంలో మరో చిత్రానికి సంతకం చేశాడు. వచ్చే జనవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రానికి 'చెర్రీ" అనే టైటిల్ పరిశీలనలో వుంది. ఆ వెంటనే 'బృందావనం" చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానరుపై రానున్న 'వాడే" చిత్రంలో చరణ్ నటించనున్నాడు. ఈవిధంగా 2012 సంవత్సరం మొత్తం చరణ్ క్యాలెండర్ నిండి పోయింది.


Click it and Unblock the Notifications











