»   » రామ్ చరణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ కన్‌ఫర్మ్

రామ్ చరణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ కన్‌ఫర్మ్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైనమిక్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో త్వరలో ఓ మెగా మూవీ రాబోతోంది. విశ్వసనీయంగా ఫిల్మ్ నగర్ నుంచి అందిన సమాచారం ప్రకారం మరో సంవత్సరంలో ఈ ప్రాజెక్టు ప్రారంభం కాబోతోంది. అఫ్ కోర్స్ 2010లో త్రివిక్రమ్ దర్శకత్వంలో రామ్ చరణ్ పెప్సి యాడ్లో నటించినప్పటి నుంచి ఈ వార్తలు వినిపిస్తున్నప్పటికీ....ఈ సారి మాత్రం ఈ వార్త నిజం కాబోతుంది.

ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీలైన్ ఓకే అయిందని, ప్రస్తుతం ఈ ఇద్దరు కమిటైన సినిమాలు పూర్తయిన తర్వాత ఈ చిత్రం ఫ్లోర్ మీదకు రానున్నట్లు తెలుస్తోంది. స్క్రిప్టు వర్కు, డైలాగులు తదితర పనులు పూర్తి కావాల్సి ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రం పూర్తయిన తర్వాత చరణ్ సినిమాపై దృష్టి పెట్టనున్నాడు.

రామ్ చరణ్ ప్రస్తుతం తెలుగులో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేసిన 'ఎవడు' విడుదలకు సిద్దంగా ఉంది. మరో వైపు కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయ్యాడు. చరణ్ హిందీలో అపూర్వ లఖియా దర్శకత్వంలో చేసిన 'జంజీర్' చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే పవన్ కళ్యాణ్‌తో 'జల్సా', అల్లు అర్జున్‍‌తో 'జులాయి' లాంటి హిట్ కొట్టి మెగా హీరోలకు నమ్మకమైన దర్శకుడిగా మారిన త్రివిక్రమ్...రామ్ చరణ్‌తో కూడా మరో మెగా హిట్ కొట్టడం ఖాయమనే నమ్మకంతో ఉన్నారు మెగా అభిమానులంతా.

English summary
Film Nagar source said that, Mega power star Ram Charan’s next committment will be with Trivikram is confirmed. The storyline was okayed.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu