రామ్ చరణ్-త్రివిక్రమ్ కాంబో మూవీ స్టోరీ ఓకే!
హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, డైనమిక్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో త్వరలో ఓ మెగా మూవీ రాబోతోంది. విశ్వసనీయంగా ఫిల్మ్ నగర్ నుంచి అందిన సమాచారం ప్రకారం మరో సంవత్సరంలో ఈ ప్రాజెక్టు ప్రారంభం కాబోతోంది. అఫ్ కోర్స్ 2010లో త్రివిక్రమ్ దర్శకత్వంలో రామ్ చరణ్ పెప్సి యాడ్లో నటించినప్పటి నుంచి ఈ వార్తలు వినిపిస్తున్నప్పటికీ....ఈ సారి మాత్రం ఈ వార్త నిజం కాబోతుంది.
ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీలైన్ 3 నెలల క్రితమే ఓకే అయిందని, గబ్బర్ సింగ్ నిర్మాత బండ్ల గణేష్ చిత్రాన్ని నిర్మించన్నారని తెలుస్తోంది. స్క్రిప్టు వర్కు, డైలాగులు తదితర పనులు పూర్తి కావాల్సి ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయడానికి సిద్దం అవుతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రం పూర్తయిన తర్వాత చరణ్ సినిమాపై దృష్టి పెట్టనున్నాడు.
రామ్ చరణ్ ప్రస్తుతం తెలుగులో వివి వినాయక్ దర్శకత్వంలో 'నాయక్' చిత్రంతో పాటు, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు' చిత్రాల్లో నటిస్తున్నాడు. మరో వైపు హిందీలో అపూర్వ లఖియా దర్శకత్వంలో 'జంజీర్' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాత రామ్ చరణ్ త్రివిక్రమ్ సినిమాలో నటించనున్నాడు.
ఇప్పటికే పవన్ కళ్యాణ్‌తో 'జల్సా', అల్లు అర్జున్‍తో 'జులాయి' లాంటి హిట్ కొట్టి మెగా హీరోలకు నమ్మకమైన దర్శకుడిగా మారిన త్రివిక్రమ్...రామ్ చరణ్‌తో కూడా మరో మెగా హిట్ కొట్టడం ఖాయమనే నమ్మకంతో ఉన్నారు మెగా అభిమానులంతా.


Click it and Unblock the Notifications











