అద్బుతమైన సినిమా అంటూ రామ్ చరణ్ ట్వీట్
రామ్ చరణ్ ఎప్పటికప్పుడు తన అభిమానులకు తమ మనస్సులోని ఆలోచనలును పంచుకోవటం ట్విట్టర్ తో అలవాటైంది. తాజాగా ఆయన చూసిన అగ్నిపధ్ సినిమా గురించి ట్వీట్ చేస్తూ...అగ్నిపధ్ చాలా ఉత్కంటతతో కూడిన ఎమోషనల్ ఏక్షన్ మూవీ. అలాంటిసినిమా నేను ఇప్పటివరకూ చూడలేదు..తీయలేదు. నేను చాలా ఇష్టపడ్డాను ఆ సినిమాను..హాట్యాఫ్ టు హృతిక్ రోషన్ అని ట్వీట్ చేసారు. హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రా, సంజయ్ దత్ కాంబినేషన్ లో రూపొందిన అగ్నిపధ్ చిత్రం మొన్న శుక్రవారం అంటే జనవరి 26న విడుదల అయ్యింది. మార్నింగ్ షోకే ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ 41 కోట్లు చెల్లించి జీ టీవీ వారు సొంతం చేసుకున్నారు.
ఈ మొత్తం బాలీవుడ్ చరిత్రంలో ఓ పెద్ద రికార్డుగా అభివర్ణిస్తున్నారు. 1990లో అమితాబ్ హీరోగా, డాని డెంజోపా విలన్ గా నటించిన చిత్రం 'అగ్నిపధ్'కి ఇది రిమేక్. ఇందులో సంజయ్‌దత్ 'కంచా చీనా' పాత్ర చేసాడు. ఇందులో విలన్ గా చేస్తున్న సంజయ్ దత్ ని చూస్తేనే విలన్‌కి కూడా వెన్నులో వణుకు పుట్టేలా ఉన్నాడు. విలన్ గా కనపడేందుకు సంజయ్ తలనీలాలు సమర్పించుకోవడమే కాక, చెవి పోగు కూడా పెట్టుకున్నారు. సినిమాలో చాలావరకు నలుపు రంగు దుస్తుల్లోనే కనిపిస్తాడు. అటు సంజయ్ దత్,ఇటు హృతిక్ రోషన్ అబిమానులు ఈ సినిమాని సూపర్ హిట్ చేసే పనిలో ఉన్నారు.


Click it and Unblock the Notifications











