మహేష్ ని ఉద్దేశించి రామ్ చరణ్ ట్వీట్
రామ్ చరణ్ తాజాగా ఇలా ట్వీట్ చేసారు...ఒకరు నిజంగా ఏదైనా సాధించినప్పుడు తన సక్సెస్ గురించి తన గొంతు విప్పాల్సిన పనిలేదు.ఎందుకంటే ప్రజలు ఆటోమేటిక్ గా దాని గురించే మాట్లాడుకుంటారు అన్నారు.అయితే దూకుడు రికార్డుల గురించి వివాదం జరుగుతున్న ఈ సమయంలో రామ్ చరణ్ నర్మగర్భంగా ఇలా ట్వీట్ చేయటంతో అందరూ దీన్ని డైరక్ట్ గా దూకుడు చిత్రం గురించే అని మహేష్ అప్పుడు ట్వీట్ చేసిన దానికి సమాధానమని భావిస్తున్నారు.మహేష్ తన దూకుడు చిత్రం గురించి ఆ మధ్య...ఇది అపీషయల్.. దూకుడు తెలుగు ఇండస్ట్రీలో హైయిస్ట్ గ్రాసర్. .అన్ బిలీవబుల్ అని ట్వీట్ చేసారు. ఈ విషయం అంతటా చర్చనీయాంశమైంది.మరో ప్రక్క మగధీర చిత్రంతో దూకుడు ని పోలుస్తూ మెగాభిమానలు రీసెంట్ గా విజయవాడలో లక్ష రూపాయలు ప్రైజ్ మనీ ప్రకటించారు.దూకుడువి ఫేక్ రికార్డులని వారు అబియోగం.అయితే దానికి మహేష్ అభిమానులు స్పందిస్తూ..దూకుడువి ఫేక్ రికార్డులని రుజువు చేస్తే కోటి ఇస్తామని కౌంటర్ ఇచ్చారు.ఈ నేపధ్యంలో రామ్ చరణ్ ట్వీట్ చేయటం అంతటా వేడిక్కించింది.రామ్ చరణ్ అభిమానుల్లో ఆనందాన్ని కలుగచేసింది.ఇక ప్రస్తుతం రామ్ చరణ్ ..రచ్చ షూటింగ్ లో పాల్గొంటున్నారు.సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ఆ చిత్రం పక్కా మాస్ ఎంటర్టైనర్ గా రూపొందుతోందని సమాచారం.మరో ప్రక్క మహేష్ బాబు..ది బిజెనెస్ మ్యాన్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











