'గబ్బర్ సింగ్' పై రామ్ చరణ్ కామెంట్

By Srikanya

మెగాభిమానులు ఎదురు చూస్తున్న ట్వీట్ వచ్చేసింది. అదే రామ్ చరణ్ ..గబ్బర్ సింగ్ గురించి కామెంట్ చెయ్యటం. క్రితం శుక్రవారం విడుదలైన గబ్బర్ సింగ్ చిత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ నేపధ్యంలో రామ్ చరణ్ ఈ చిత్రం గురించి ఏం చెప్తాడా అని ఎదురుచూసారు. కొందరైతే అత్యుత్సాహంగా రామ్ చరణ్ కావాలనే ఈ చిత్రం గురించి సైలెంట్ గా ఉన్నాడని కథనాలు సైతం వెలువరించేసాడు. దాంతో పవన్ ఇండియాకి రాగానే మొదట ఈ చిత్రం గురించి కామెంట్ చేస్తూ ట్వీట్ చేసాడు.

రామ్ చరణ్ రాసిన ట్వీట్ లో..."మా ఫ్యాన్స్ కి పండగ. చాలా ఆనందంగా ఉంది పవర్ బాబాయ్ గబ్బర్ సింగ్ ఎమేజింగ్. నేను 18న ఇండియాకు వచ్చాను. ఇంక సినిమా చూడకుండా ఉండలేకపోయాను. ఈ టీమ్ మొత్తానికి కంగ్రాట్స్" అంటూ ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ పవన్ అభిమానులకే కాక మెగా అభిమానుల మొత్తానికి ఆనందం కలిగించింది. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ మూడు చిత్రాల షూటింగ్ లలో బిజీగ ఉన్నారు.

అవి వివి వినాయిక్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్. ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు వినికిడి. ఆకుల శివ కథకు వినాయిక్ అద్బుతమైన స్క్రీన్ ప్లేతో ఈ చిత్రాన్ని మాస్ కి నచ్చేలా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం యాభన్ ఎపిసోడ్స్ తో షూటింగ్ మొదలైంది. రెండో షెడ్యూల్ త్వరలో జరగనుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కాజల్ నటిస్తోంది.

అలాగే రామ్ చరణ్ హిందీ జంజీర్ లో నటిస్తున్నారు. అమితాబ్ జంజీర్ కి రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని అపూర్వ లఖియా డైరక్ట్ చేస్తున్నాడు. ఈ కాలనికి తగినట్లుగా ఆయిల్ మాఫియా నేపధ్యంలో ఈ చిత్రం కథని మార్చి రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన ప్రియాంక చోప్రా చేస్తోంది. ఈ చిత్రాలతో పాటు మరోప్రక్క వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఎవడు చిత్రం చేస్తన్నాడు. అల్లు అర్జున్ గెస్ట్ రోల్ లో కనపించే ఈ చిత్రంలో హీరోయిన్ గా సమంత చేస్తోంది. యాక్షన్ తో కూడిన విభిన్నమైన చిత్రగా దీన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X