మాకు శుభాకాంక్షలు తెలపండి: రామ్ చరణ్
"ముంబైలో 'జంజీర్' తొలి షెడ్యూల్ షూటింగ్‌లో ఉన్నా. గొప్ప టీమ్‌తో పనిచేస్తున్నా. మాకు శుభాకాంక్షలు తెలపండి'' అని రామ్ చరణ్ తేజ ట్వీట్ చేశాడు. తెలుగులో 'రచ్చ'తో హిట్ కొట్టిన రాంచరణ్ బాలీవుడ్‌లో ఈ చిత్రంతో అడుగుపెట్టాడు. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తొలి బాలీవుడ్ సినిమా 'జంజీర్' షూటింగ్ ముంబైలో మొదలైంది. ఈ సందర్బంగా రామ్ చరణ్ ఈ ట్వీట్ చేసి తన అభిమానులను ఆనందపరిచాడు.
ఇక గతంలో 'ముంబై సే ఆయా మేరా దోస్త్', 'ఏక్ అజ్‌నబీ', 'షూటవుట్ ఎట్ లోఖండ్‌వాలా' చిత్రాల్ని రూపొందించిన అపూర్వ లఖియా ఈ రీమేక్ కి దర్శకుడు. 1973లో సూపర్ హిట్ అయిన అమితాబ్ బచ్చన్ సినిమా 'జంజీర్'కు ఇది రీమేక్. రాంచరణ్ సరసన ప్రియాంకా చోప్రా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్, అర్జున్ రాంపాల్, మహీ గిల్ ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రాన్ని రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు అమిత్ మెహ్రా నిర్మిస్తున్నాడు. పాత 'జంజీర్' దర్శకుడు ప్రకాశ్ మెహ్రా కుమారుడే ఈ అమిత్. తన తండ్రి సాధించిన విజయాన్ని ఈ చిత్రంతో కొనసాగించలనుకుంటున్నాని చెప్తున్నాడు.
ఈ చిత్రంలో అమితాబ్ ఓ గెస్ట్ పాత్రలో కనిపించనున్నాడని బాలీవుడ్ సమాచారం. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అమిత్ మెహ్రా నిర్మాత. ఈ రీమేక్‌లో అమితాబ్ అతిథి పాత్రలో కనపడటానికి అమితాబ్ ఆసక్తి చూపిస్తున్నాడని బాలీవుడ్ సమాచారం. ఈ విషయమై దర్శకుడు అపూర్వ లఖియా ని మీడియా సంప్రదించింది. ఆయన మాట్లాడుతూ ''అమితాబ్ మా సినిమాలో నటిస్తున్నారని ఇంకా అధికారికంగా చెప్పలేను. ఆయన్ని సంప్రదిస్తున్న మాట వాస్తవమే. బిగ్ బి ఆశీస్సులు లేకుండా ఈ సినిమాను తీయలేం'' అన్నారు.
అలాగే ఈ చిత్రం ఆయిల్ మాఫియా చుట్టూ తిరగనున్నట్లు స్క్రిప్టుని తిరగరాసినట్లు దర్శకుడు తెలియచేసాడు. సంజయ్ దత్ ఈ చిత్రంలో విలన్ గా చేయనున్నారు. అగ్నిపధ్ లో సంజయ్ దత్ అదరకొట్టడంతో నెగిటివ్ పాత్రకు ఆయనైతేనే సరిపోతాడని భావిస్తున్నారు. ఇక రామ్ చరణ్ మాత్రం తన తాజా చిత్రం రచ్చ రిలీజ్ హడావిడిలో ఉన్నారు. ఏప్రియల్ 5న విడుదల అవుతున్న ఆ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











