'జంజీర్' తెలుగు వెర్షన్ పై రామ్ చరణ్ ట్వీట్
రామ్ చరణ్ తాజాగా అమితాబ్ సూపర్ హిట్ జంజీర్ ని రీమేక్ ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని తెలుగులో సైతం రిలిజ్ చేయనున్నారు. ఈ విషయమై రామ్ చరణ్ ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ లో....పనిలో పనిగా మేము జంజీర్ ని హిందీతో పాటు తెలుగు వెర్షన్ ని కూడా షూట్ చేస్తున్నాం అన్నారు. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అమిత్ మెహ్రా నిర్మాత. ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రానికి మార్కెట్లో అప్పుడే క్రేజ్ మొదలైంది.
గతంలో 'ముంబై సే ఆయా మేరా దోస్త్', 'ఏక్ అజ్‌నబీ', 'షూటవుట్ ఎట్ లోఖండ్‌వాలా' చిత్రాల్ని రూపొందించిన అపూర్వ లఖియా ఈ రీమేక్ కి దర్శకుడు. 1973లో సూపర్ హిట్ అయిన అమితాబ్ బచ్చన్ సినిమా 'జంజీర్'కు ఇది రీమేక్. రాంచరణ్ సరసన ప్రియాంకా చోప్రా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్, అర్జున్ రాంపాల్, మహీ గిల్ ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రాన్ని రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు అమిత్ మెహ్రా నిర్మిస్తున్నాడు. పాత 'జంజీర్' దర్శకుడు ప్రకాశ్ మెహ్రా కుమారుడే ఈ అమిత్. తన తండ్రి సాధించిన విజయాన్ని ఈ చిత్రంతో కొనసాగించలనుకుంటున్నాని చెప్తున్నాడు.
అలాగే ఈ చిత్రంలో అమితాబ్ ఓ గెస్ట్ పాత్రలో కనిపించనున్నాడని బాలీవుడ్ సమాచారం. ఈ రీమేక్‌లో అమితాబ్ అతిథి పాత్రలో కనపడటానికి అమితాబ్ ఆసక్తి చూపిస్తున్నాడని బాలీవుడ్ సమాచారం. ఈ విషయమై దర్శకుడు అపూర్వ లఖియా ని మీడియా సంప్రదించింది. ఆయన మాట్లాడుతూ ''అమితాబ్ మా సినిమాలో నటిస్తున్నారని ఇంకా అధికారికంగా చెప్పలేను. ఆయన్ని సంప్రదిస్తున్న మాట వాస్తవమే. బిగ్ బి ఆశీస్సులు లేకుండా ఈ సినిమాను తీయలేం'' అన్నారు.
మరో ప్రక్క రామ్ చరణ్ ఈ చిత్రం కోసం హిందీ నేర్చుకుంటున్నాడు. ఆ విషయం చెప్తూ...నా హిందీ నేర్చుకునే విషయానికి వస్తే...ఓ ట్యూటర్ తో నేను హిందీ నేర్చుకునే పనిలో ఉన్నాను అన్నారు. అలాగే ఈ చిత్రం ఆయిల్ మాఫియా చుట్టూ తిరగనున్నట్లు స్క్రిప్టుని తిరగరాసినట్లు దర్శకుడు తెలియచేసాడు. సంజయ్ దత్ ఈ చిత్రంలో విలన్ గా చేయనున్నారు. అగ్నిపధ్ లో సంజయ్ దత్ అదరకొట్టడంతో నెగిటివ్ పాత్రకు ఆయనైతేనే సరిపోతాడని భావిస్తున్నారు. ఇక రామ్ చరణ్ మాత్రం తన తాజా చిత్రం రచ్చ రిలీజై మంచి టాక్ తెచ్చుకుని దూసుకుపోవటంతో చాలా ఉత్సాహంగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











