twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ముంబైలో రామ్ చరణ్‌‌‌కు సర్జరీ, సక్సెస్‌ఫుల్

    By Bojja Kumar
    |

    ముంబై : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్‌కు సక్సెస్‌గా సర్జరీ జరిగింది. గత కొంతకాలంగా చరణ్ సైనస్ సమస్యతో బాధ పడుతున్నాడు. ఇంతకాలం షూటింగులతో బిజీగా ఉండటం వల్ల సర్జరీ వాయిదా వేసుకుంటూ వచ్చిన ఆయన....ఇపుడు ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నాడు.

    రామ్ చరణ్‌కు సర్జరీ ఆయన భార్య ఉపాసనకు చెందిన హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలోనే జరుపాలని గతంలో నిర్ణయించినప్పటికీ చివరగా ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో సర్జరీ నిర్వహించారు. అపోలో ఆసుపత్రి వైద్యుల సూచన మేరకే ఆయన హిందూజా ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్నట్లు టాక్.

    హిందూ ఆసుపత్రికి చెందిన స్పెషలిస్ట్ డాక్టర్ కీర్తనె ఈ సర్జరీ నిర్వహించారని, ఈ సర్జరీలో అపోలో ఆసుపత్రికి చెందిన డాక్టర్లు కూడా పాలుపంచుకున్నట్లు తెలుస్తోంది. సర్జరీ తర్వాత ఆపోలోలో ఆసుపత్రి వైద్య బృందమే ఆయన్ను దగ్గరుండి చూసుకుంటున్నారట. ప్రస్తుతం రామ్ చరణ్ సర్జరీ నుంచి కోలుకుంటున్నాడు.

    రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.....చరణ్ నటించిన తొలి బాలీవుడ్ మూవీ 'జంజీర్' ఇటీవల విడుదలై బాక్సాసు వద్ద బోల్తా పడింది. తెలుగు వెర్షన్ 'తుఫాన్' కూడా ఫెయిల్యూర్ టాక్ సొంతం చేసుకుంది. జంజీర్ విడుదలకు ముందే రామ్ చరణ్ మరో రెండు బాలీవుడ్ ప్రాజెక్టులకు కమిట్ అయ్యారు. ఇక ఆయన తెలుగులో నటించిన 'ఎవడు' చిత్రం విడుదల కావాల్సి ఉంది.

    English summary
    Mega power star Ram Charan has undergone a surgery at Hinduja Hospital in Mumbai. octors said that he is fine now and taking rest. While surgery was done at Hinduja Hospital, it is reported that a group of high profile doctors from Apollo Hospitals were also by the side of him.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X