రామ్‌చరణ్‌ చేతుల మీదుగా 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి' ట్రైలర్‌

'సప్తగిరి ఎల్‌ఎల్‌బి' చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్‌ 7న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌కు సిద్ధమవుతున్నది.

By Rajababu

కామెడీ కింగ్‌ సప్తగిరి కథానాయకుడిగా 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని నిర్మించిన సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై లిమిటెడ్‌ అధినేత డా.రవికిరణ్‌ మళ్లీ సప్తగిరి హీరోగా 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి' చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్‌ 7న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌కు సిద్ధమవుతున్నది.

Ram Charan to Unveil the Saptagiri LLB trailor

విజయ్‌ బుల్గానిన్‌ సంగీత సారధ్యంలో ఈ చిత్రం ఆడియో రూపొందింది. మొదటి పాటను సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వీవీ వినాయక్‌ విడుదల చేయగా, రెండో పాటను సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌తేజ్‌ రిలీజ్‌ చేశారు. ఈ రెండు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోందని నిర్మాత డా.రవికిరణ్‌ తెలిపారు. కాగా, ఈ చిత్రం థియేట్రికల్‌ ట్రైలర్‌ను ఆదివారం మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ విడుదల చేయనున్నారు.

డిసెంబర్‌ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రంలో కామెడీ కింగ్‌ సప్తగిరి సరసన కశిష్‌ వోరా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్‌, సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌, కో-డైరెక్టర్‌: రాజశేఖర్‌రెడ్డి పులిచెర్ల, ఫొటోగ్రఫీ: సారంగం ఎస్‌.ఆర్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: అర్జున్‌, పాటలు: చంద్రబోస్‌, కందికొండ, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: భిక్షపతి తుమ్మల, నిర్మాత: డా. రవికిరణ్‌, దర్శకత్వం: చరణ్‌ లక్కాకుల.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X