లక్కు అంటే సప్తగిరిదే.. మెగా హీరో చేతుల మీదుగా సప్తగిరి ఎల్‌ఎల్‌బి ట్రైలర్‌

కామెడీ కింగ్‌ సప్తగిరి కథానాయకుడిగా సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై లిమిటెడ్‌ అధినేత డాక్టర్ రవికిరణ్‌ మళ్లీ సప్తగిరి హీరోగా 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి' చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలి

By Rajababu

కామెడీ కింగ్‌ సప్తగిరి కథానాయకుడిగా సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై లిమిటెడ్‌ అధినేత డాక్టర్ రవికిరణ్‌ మళ్లీ సప్తగిరి హీరోగా 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి' చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. గతంలో సప్తగిరి హీరోగా సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ లాంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం హిందీలో సంచలన విజయం సాధించిన జాలీ ఎల్‌ఎల్‌బి పార్ట్‌-1 చిత్రాన్ని 'సప్తగిరి ఎల్‌ఎల్‌బిగా తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ విడుదల చేస్తునున్నారనే వార్త సంచలనంగా మారింది.

 పవన్ చేతుల మీదుగా సప్తగిరి ఎక్స్‌ప్రెస్

పవన్ చేతుల మీదుగా సప్తగిరి ఎక్స్‌ప్రెస్

సప్తగిరి ఎక్స్‌ప్రెస్ చిత్రాన్ని సంబంధించిన ఆడియోను పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు. వాస్తవానికి సప్తగిరి ఎక్స్‌ప్రెస్ సినిమా పేరు కాటమరాయుడుగా ఉండేది. అయితే పవన్ తనకు ఆ టైటిల్ కావాలని కోరడంతో కాటమరాయుడు టైటిల్‌ను సప్తగిరి త్యాగం చేశాడు. అందుకు ప్రతిఫలంగా పవన్ కల్యాణ్ స్వయంగా వచ్చి సప్తగిరి ఎక్స్ ప్రెస్ ఆడియోను ఆవిష్కరించారు.

 ఆనందంలో సప్తగిరి

ఆనందంలో సప్తగిరి

హీరోగా తన రెండో సినిమా ట్రైలర్‌ను మెగా హీరో రాంచరణ్ ఆవిష్కరించనుండటం సప్తగిరి సంతోషంలో ఉన్నాడు. మెగా హ్యాండ్ పడితే హిట్ అనే భావనలో దర్శక, నిర్మాతలు ఉన్నట్టు సమాచారం. ఈ సందర్భంగా నిర్మాత డాక్టర్ రవికిరణ్‌ మీడియాతో మాట్లాడారు.

రాంచరణ్ చేతుల మీదుగా ట్రైలర్

రాంచరణ్ చేతుల మీదుగా ట్రైలర్

సప్తగిరి ఎల్‌ఎల్‌బీ చిత్రం ట్రైలర్‌ను రామ్‌చరణ్‌గారి చేతుల మీదుగా విడుదల చేస్తున్నాం. ఇటీవల విడుదలైన టీజర్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తున్నది. బిజినెస్‌ పరంగా కూడా మంచి క్రేజ్‌ వచ్చింది. మా బేనర్‌లో నిర్మించిన తొలి సినిమా 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' సూపర్‌హిట్‌ అయింది. దాన్ని మించిన విజయం సాధించేలా వుంటుంది. డెఫినెట్‌గా 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి' రెండో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ కూడా ప్రకటిస్తాం'' అన్నారు.

 పవన్ కల్యాణ్ ఆశీర్వదించారు

పవన్ కల్యాణ్ ఆశీర్వదించారు

హీరో సప్తగిరి మాట్లాడుతూ ''హీరోగా నేను నటించిన మొదటి చిత్రం ఆడియో ఫంక్షన్‌కి పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌గారు విచ్చేసి నన్ను ఆశీర్వదించారు. ఆ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇప్పుడు 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి' ట్రైలర్‌ను విడుదల చేసేందుకు మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌గారు అంగీకరించడం చాలా ఆనందంగా వుంది అని అన్నారు.

 జీవితాంతం రుణపడి ఉంటా

జీవితాంతం రుణపడి ఉంటా

మెగాస్టార్‌ చిరంజీవిగారి అభిమానిని అవడం నా అదృష్టం. మెగా ఫ్యామిలీ నాకు అందిస్తున్న సహకారానికి జీవితాంతం రుణపడి వుంటాను. మంచి సబ్జెక్ట్‌తో రూపొందుతున్న 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి' చిత్రం తప్పకుండా అందర్నీ ఎంటర్‌టైన్‌ చేస్తుంది'' అన్నారు.

 నటీనటులు, సాంకేతిక వర్గం

నటీనటులు, సాంకేతిక వర్గం

కామెడీ కింగ్‌ సప్తగిరి సరసన కశిష్‌ వోరా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్‌, సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌, కో-డైరెక్టర్‌: రాజశేఖర్‌రెడ్డి పులిచెర్ల, ఫొటోగ్రఫీ: సారంగం ఎస్‌.ఆర్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: అర్జున్‌, పాటలు: చంద్రబోస్‌, కందికొండ, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: భిక్షపతి తుమ్మల, నిర్మాత: డా. రవికిరణ్‌, దర్శకత్వం: చరణ్‌ లక్కాకుల.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X