అఖిల్ ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ నిశ్చితార్థం... వేడుకలో రామ్ చరణ్-ఉపాసన (ఫోటోస్)

By Bojja Kumar

అఖిల్ అక్కినేని ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ శ్రీయ భూపాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనుకుంటా. 2016లో వీరి ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్ అయింది. ఇంట్లో వారిని ఒప్పించి పెళ్లి సిద్ధమవ్వడం, డిసెంబర్ 2016లో వీరి ఎంగేజ్మెంట్ జరగడం తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల ఇద్దరూ పెళ్లి పీటలు ఎక్కక ముందే విడిపోయారు. ఆ వ్యవహారం తర్వాత అఖిల్ సినిమాలతో బిజీ అయిపోయారు. కట్ చేస్తే... శ్రీయ భూపాల్ నిశ్చితార్థం నిన్న (ఏప్రిల్ 22) హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. శ్రీయ భూపాల్ పెళ్లి ఉపాసన తమ్ముడు అనిందిత్ రెడ్డితో సెట్టయింది.

Recommended Video

Ram charan Got Clicked In Kitchen
అనందిత్ రెడ్డితో శ్రీయ భూపాల్ ఎంగేజ్మెంట్

అనందిత్ రెడ్డితో శ్రీయ భూపాల్ ఎంగేజ్మెంట్

శ్రీయ భూపాల్ పెళ్లి అనిందిత్ రెడ్డితో సెట్టయింది. వీరి ఎంగేజ్మెంట్ వేడుక ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో రామ్ చరణ్, ఉపాసన, పింకీ రెడ్డి ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీరిని విష్ చేస్తూ పింకీరెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు కూడా చేశారు.

 ఎవరీ అనిందిత్ రెడ్డి?

ఎవరీ అనిందిత్ రెడ్డి?

అనిందిత్ రెడ్డి ఎవరో కాదు... అపోలో సంస్థల అధినేత ప్రతాప్ సి.రెడ్డి మనవడు, చేవేళ్ల సిట్టింగ్ ఎంపీ, తెలంగాణ రిచ్చెస్ట్ పొలిటీషియన్ విశ్వేశ్వర్ రెడ్డి పెద్దకుమారుడు.

ఉపాసనతో రిలేషన్ ఇలా...

ఉపాసనతో రిలేషన్ ఇలా...

అనిందిత్ రెడ్డి మదర్ సంగీత,...ఉపాసన మదర్ శోభన సొంత అక్కాచెల్లెల్లు. దీని ప్రకారం అనిందిత్, ఉపాసన బ్రదర్, సిస్టర్ రిలేషన్ అన్నమాట. ఈ ఎంగేప్మెంట్ వేడుకలో శ్రీయ భూపాల్ సిల్వర్ ఎంబలిష్డ్ లెహంగాలో అందంగా మెరిసిపోగా, లైట్ బ్లూ ట్రెడిషనల్ ఔట్ ఫిట్‌లో అనిందిత్ హాండ్సమ్ లుక్‌లో అందరి దృష్టిని ఆకర్షించారు.

పింకీ రెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్

పింకీ రెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్

వీరి బంధువు పింకీ రెడ్డి పుట్టినరోజు కూడా ఇదే రోజు కావడంతో ఎంగేజ్మెంట్ వేడుకతో పాటు పింకీ రెడ్డి బర్త్ డే వేడుక కూడా నిర్వహించారు.

అనందిత్ రెడ్డి, శ్రీయ భూపాల్

అనందిత్ రెడ్డి, శ్రీయ భూపాల్

అనిందిత్ విషయానికొస్తే... దేశీయ మోటార్ స్పోర్ట్స్ సర్కిల్‌లో అనందిత్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. శ్రీయ భూపాల్ ప్రముఖ డిజైనర్ అనే విషయం తెలిసిందే. అమెరికాలో ఆమె ఫ్యాషన్ డిజైనింగులో కోర్సు కూడా చేశారు.

 ఉపాసన అదిరిపోయే లుక్

ఉపాసన అదిరిపోయే లుక్

ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఔట్ ఫిట్లో రామ్ చరణ్ భార్య ఉపాసన అదిరిపోయే లుక్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది.

రామ్ చరణ్

రామ్ చరణ్

శ్రీయ భూపాల్, అనందిత్ రెడ్డి ఎంగేజ్మెంట్ వేడుకలో రామ్ చరణ్.

రామ్ చరణ్‌తో సెల్ఫీలు

రామ్ చరణ్‌తో సెల్ఫీలు

ఎంగేజ్మెంట్ వేడుకకు హాజరైన అతిథులు కొందరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి సెల్పీలు దిగడానికి ఆసక్తి చూపారు.

డబుల్ సెలబ్రేషన్స్

డబుల్ సెలబ్రేషన్స్

అటు ఎంగేజ్మెంట్ వేడుక, ఇటు పింకీ రెడ్డి బర్త్ డే.... ఇలా ఒకే రోజు డబుల్ సెలబ్రేషన్స్ జరిగాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X