వెన్యూ ఛేంజ్: చరణ్-ఉపాసన నిశ్చితార్థం పూర్తి వివరాలు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్-ఉపాసన కామినేని నిశ్చితార్థం డిసెంబర్ 1న జరుగనున్న విషయం తెలిసిందే. అయితే నిశ్చితార్థ వేడుక ఎక్కడ జరుగుతుందనే విషయమై ఇప్పటి వరకు సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. నిన్నమొన్నటి వరకు ఈ వేడుక దోమకొండ కోటలో అని ఒకసారి, గోల్కొండ రిసార్ట్స్ లో జరుగుతుందని మరొక సారి ప్రచారం జరిగింది. అయితే అది వాస్తవం కాదని తాజాగా మంగళవారం మెగాకుటుంబ సన్నిహితుల నుంచి అందిన సమాచారం.
ఉపాసన కుటుంబానికి చెందిన ఫాం హౌస్ లో నిశ్చితార్థ వేడుక ఏర్పాట్లు మంగళవారం ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి చిలుకూరు బాలాజీ టెంపుల్ కు వెళ్లే దారిలో ఈ ఫాం హౌజ్ ఉంది. ఈ వేడుకకు ఇరు కుటుంబాల బంధువుల, సన్నిహితులకు మాత్రమే ఆహ్వానం అందింది. డిసెంబర్ 1న రాత్రి గం.7.30లకు చరణ్-ఉపాసన నిశ్చితార్థం వైభవంగా జరుగబోతోంది. కేవలం ఒక్కరోజు మాత్రమే సమయం ఉండటంతో ఇప్పటికే ఈ ఫాం హౌజ్ లో డెకోరేషన్, వంట సామాగ్రి, ఇతర సరంజామాను చేర్చే ప్రయత్నం మొదలు పెట్టారు.


Click it and Unblock the Notifications











