రామ్ చరణ్ దంపతులకు ప్రియాంక చోప్రా పార్టీ.. స్టార్ డైరెక్టర్ తో చెర్రీ.. ఇంటర్నేషనల్ మూవీ ప్లాన్?
ప్రస్తుతం రామ్ చరణ్ రేంజ్ పెరిగిపోయింది. మెగా పవర్ స్టార్ గా తెలుగు ప్రేక్షకుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఇక జక్కన్న తెరకెక్కించిన రౌద్రం రణం రుధిరం (RRR) సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తెగ పాపులర్ అయిపోయాడు. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటనపై తెలుగు ప్రేక్షకులు, సినీ విమర్శకులే కాకుండా విదేశీయులు సైతం కొనియాడుతున్నారు. ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఏర్పాటు చేసిన ప్రీ ఆస్కార్ పార్టీలో రామ్ చరణ్-ఉపాసన దంపతులు మెరిసారు.

చెర్రీ నటనకు..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా ద్వారా దేశవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. రౌద్రం రణం రుధిరం సినిమా అనేక అవార్డులను కొల్లగొట్టింది. ఎమ్ఎమ్ కీరవాణి మ్యాజికల్ మ్యూజిక్ గా వచ్చిన ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో అదరగొట్టిన చెర్రీ నటనకు యావత్ ప్రపంచమే ప్రశంసల జల్లులు కురిపించింది. తెలుగు సినిమా చిరకాల కోరిక అయిన ఆస్కార్ కోసం నాటు నాటు సాంగ్ అకాడమీ అవార్డుల నామినేషన్స్ లో ఉంది.

అనేక ఇంటర్వ్యూల్లో..
RRRలోని నాటు నాటు పాటకు కచ్చితంగా ఆస్కార్ అవార్డు వస్తుందని చిత్ర యూనిట్ తో పాటు కోట్లాది భారతీయులు నమ్ముతున్నారు. ఈ క్రమంలో ఆస్కార్ వేడుకల కంటే ముందుగానే చిత్రబృందం అమెరికా వెళ్లింది. ఇందులో భాగంగానే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి తదితరులు వరుస పెట్టి అమెరికన్ పాపులర్ మీడియా ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇప్పటికే అనేక ఇంటర్వ్యూల్లో నాటు నాటు సాంగ్ చిత్రీకరణ కోసం పడిన కష్టాన్ని చెర్రీ చెప్పుకొచ్చాడు.

గ్లోబల్ స్టార్ గా..
ఇదిలా ఉంటే మార్చి 12న ఆస్కార్ 2023 అవార్డ్స్ ఘనంగా జరగనున్నాయి. అంటే భారతీయ కాలమానం ప్రకారం మనకు మార్చి 13న ఉదయం 5:30 గంటలకు ఈ వేడుక జరగనుంది. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి హాలీవుడ్ కు వెళ్లి గ్లోబల్ స్టార్ గా ఎదిగింది ప్రియాంక చోప్రా. నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది స్టన్నింగ్ బ్యూటి ప్రియాంక చోప్రా.

జంజీర్ సినిమాలో..
ప్రియాంక చోప్రా తాజాగా ఆస్కార్ కోసం వచ్చిన సెలబ్రిటీలకు ప్రీ ఆస్కార్ పార్టీకి హోస్ట్ గా వ్యవహరించింది. ఈ పార్టీకి దక్షిణాసియా ఫిలీం ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖుల హాజరై సందడి చేశారు. వారిలో రామ్ చరణ్, ఉపాసన, ఎన్టీఆర్, ప్రీతి జింతా, జాక్వెలెన్ ఫెర్నాండేజ్, సెంథిల్ తదితరులు ఉన్నారు. ఇక ప్రియాంక చోప్రాకు, రామ్ చరణ్ కు ఎప్పటినుంచో స్నేహం ఉందన్న విషయం తెలిసింది. వీరిద్దరు కలిసి జంజీర్ (తెలుగులో తుఫాన్) సినిమాలో నటించారు.

రామ్ చరణ్ దంపతులతో..
ప్రీ ఆస్కార్ పార్టీలో రామ్ చరణ్ దంపతులతో కలిసి ప్రియాంక చోప్రా స్పెషల్ ఫొటూషూట్ చేసింది. ఆ ఫొటోలను ఉపాసన షేర్ చేయడంతో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి. బ్లూ కలర్ సూట్ లో రామ్ చరణ్ అదిరిపోయే స్టిల్స్ ఇచ్చాడు. ఉపాసన బేబీ బంప్ తో ఎంతో అందంగా కూర్చుని పోజులిచ్చారు. వారితో ప్రియాంక చోప్రా కలిసి దిగడం ప్రస్తుతం నెటిజన్లను ఆకర్షిస్తోంది. అలాగే ఎన్టీఆర్ కూడా అదిరిపోయే లుక్ తో మెస్మరైజ్ చేశాడు.

అదృష్టంగా భావిస్తున్నా..
ఈ పార్టీలో మిషన్ ఇంపాజిబుల్ 3, స్టార్ వార్స్, సూపర్ 8 వంటి బిగ్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ జేజే అబ్రమ్స్ ను రామ్ చరణ్ కలిశారు. అతనితో ఉన్న ఫ్యాన్ బాయ్ మూమెంట్ ను షేర్ చేసుకున్నాడు. "ఇవాళ జేజే అబ్రమ్స్ ను కలవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సాయంత్రం నన్ను ఆహ్వానించిందుకు ధన్యవాదాలు సార్. మీ వర్క్ కి నేను పెద్ద అభిమానిని" అని చెర్రీ పేర్కొన్నాడు. అయితే వీళ్లద్దరి కాంబినేషన్ లో ఓ ఇంటర్నేషనల్ సినిమా వస్తే చూడాలని ఫ్యాన్స్ ఆశ పడుతున్నారు.


Click it and Unblock the Notifications











