శ్రీవారి సన్నిధిలో మెగా ప్రిన్స్ క్లింకార తొలి దర్శనం.. రాంచరణ్, ఉపాసన రియాక్షన్ ట్రెండింగ్.. (వీడియో)
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన తన సతీమణి ఉపాసన కొణిదెల, కూతురు క్లీంకారతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. బుధవారం తెల్లవారుజామున సుప్రభాత సేవలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు చెర్రీ, ఉపాసన. అయితే ఆ సమయంలో క్లీంకార ఫోటో మొదటి సారి రివిల్ అయింది. ఉదయం నుంచి క్లీంకార ఫోటో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. క్లింకారను ఫోటోలు తీస్తున్న సమయంలో రామ్ చరణ్, ఉపాసన రియాక్షన్ వైరల్ అవుతుంది. మరోవైపు క్లీంకార వీడియోలో నెటిజన్స్ కొన్నింటిని గుర్తు పట్టి కామెంట్స్ చేస్తున్నారు. అవేంటో ఓసారి తెలుసుకుందాం.
వెంకన్న సేవలో జంట
రామ్ చరణ్, ఉపాసన ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నో ఏళ్లకు వీరు క్లింకారకు జన్మనిచ్చారు. గత ఏడాది వీరు పాపకు జన్మనివ్వగా.. అప్పటి నుంచి ఇప్పటి వరకు క్లీంకార ఫేస్ ను రివిల్ చేయలేదు. అయితే నేడు రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా కూతురు క్లీంకారతో కలిసి రామ్ చరణ్, ఉపాసన తిరుమలకు వెళ్లారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున సుప్రభాత సేవలోవెంకన్న దర్శనం చేసుకున్నారు ఈ జంట.

కూతురు తలనీలలు...
కూతురు క్లీంకార తలనీలాలు సమర్పించి.. వెంకన్నకు ఉపాసన, రామ్ చరణ్ మొక్కులు తీర్చుకున్నారు. అలాగే వీరికి రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందించారు టీటీడీ అధికారులు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం భార్య కూతురితో రామ్ చరణ్, ఉపాసన కలిసి హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే శ్రీవారి దర్శనానికి వెళ్లే సమయంలో క్లీంకార మొహం మొదటి సారి కనిపించింది.

తొలిసారి ఫేస్ రివిల్...
అక్కడ వీడియోలు, ఫోటోలు తీస్తున్న వారికి క్లీంకార ఫేస్ దర్శనం ఇచ్చింది. మెగా ప్రిన్సెస్ ను ఉపాసన ఎంతో జాగ్రత్తగా పట్టుకుని వెళ్తుండగా.. ఎంతో అమాయకంగా చూస్తూ కనిపించింది క్లీంకార. తలకు పాగ చుట్టుకుని బుజ్జి బుజ్జి కళ్లతో అచ్చం చెర్రీలాగే కనిపించింది క్లీంకార. అయితే ఈ వీడియో ఉదయం నుంచి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అచ్చం చెర్రీలాగే ఉందంటూ నెటిజన్స్, ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రామ్ చరణ్ బర్త్ డే సర్ ప్రైజ్...
క్లీంకార ఫేస్ చూపించకుండా ఇన్నిరోజులు జాగ్రత్తలు తీసుకున్న ఈ జంట.. ఇన్నాళ్లకు క్లీంకార ఫేస్ అనుకోకుండా దేవుడి సమక్షంలో రివిల్ అయింది. ఇక ఉపాసన తన ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేసిన అందులో క్లీంకార ముఖం కనిపించకుండా జాగ్రత్త పడేది. అందులో క్లీంకార ఫేస్ కు ఎమోజీస్ పెట్టేది. అయితే క్లీంకారను చూడాలని.. చూపించండి అంటూ సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుండే వారు. కానీ ఈరోజు చరణ్ బర్త్ డే సందర్భంగా అనుకోకుండా క్లీంకార ఫేస్ రివీల్ కావడంతో ఫ్యాన్స్ కు అసలైన సర్ ప్రైజ్ ఇదే అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











