గణేశుడి సేవలో రామ్ చరణ్ దంపతులు
వైజాగ్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఎవడు షూటింగులో భాగంగా వైజాగ్‌లో ఉన్నారు. దీంతో అక్కడే వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు. రామ్ చరణ్- ఉపాసన దంపతులు వినాయక చవితిని పురస్కరించుకుని వైజాగ్‌లోని ఆశీలుమెట్ట వద్ద ఉన్న ప్రముఖ వినాయక మండపంలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేసారు. ఆ తరువాత రామ్ చరణ్ దంపతులు గాజువాక సెంటర్లోని గుడి దగ్గరికి చేరుకొని 45 అడుగుల వినాయకుడికి దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా రామ్ చరణ్ మీడియాతో మాట్లాడుతూ...ఎలాంటి విఘ్నాలు లేకుండా అందరి జీవితాలు సంతోషంగా సాగాలని వేడుకున్నట్లు వెల్లడించారు. తనకు ఎంతో ఇష్టమైన పండగల్లో వినాయక చవితి ఒకటని, వైజాగ్‌లో బొజ్జగణపయ్యను దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
రామ్ చరణ్ ఈచిత్రంతో పాటు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు' చిత్రంతో పాటు, వివి వినాయక్ దర్శకత్వంలో నాయక్, బాలీవుడ్లో 'జంజీర్' చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఈ మూడు చిత్రాలకు డేట్స్ అడ్జెస్ట్ చేసుకుంటూ తీరిక లేకుండా కష్ట పడుతున్నాడు చరణ్. తండ్రిని మించిన తనయుడు అనిపించుకోవాలనే కసి రామ్ చరణ్‌లో కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











