ఉపాసన ఎదుట మగధీర విన్యాసాలు-పస్ట్ పబ్లిక్ ఎంట్రీ
పెళ్లి ద్వారా త్వరలో ఏకం కాబోతున్న రామ్ చరణ్, ఉపాసన తొలిసారిగా ఇద్దరు కలిసి పబ్లిక్ ముందుకు వచ్చారు. సికింద్రాబాద్ బైసన్ పోలో గ్రౌండ్స్ లో జరుగుతున్న పోలో పోటీలు జరుగుతున్న నేపథ్యంలో ఈ జంట ఇక్కడికి వచ్చి సందడి చేశారు. ఆడియన్స్ గ్యాలరీలో ఇద్దరు పక్కపక్కనే కూర్చొని ఆటను ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం చరణ్ గుర్రపు స్వారీ చేసి అందరినీ ఉత్సాహ పరిచాడు. చరణ్ విన్యాసాలను స్వయంగా చూసిన ఉపాసన ఉబ్బి తబ్బిబ్బయిపోయింది. వీరితో పాటు ఉపాసన మదర్ కూడా ఈ పోటీలను తిలకించేందుకు వచ్చారు.
తొలి సారిగా ఈ జంట పబ్లిక్ లోకి రావడంతో వారిని తమ కెమెరాల్లో బంధించడానికి మీడియా ప్రతినిధులు పోటీ పడ్డారు. రామ్ చరణ్ ఇటీవల పోలో టీంను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ పోటీల్లో రామ్ చరణ్ టీం కూడా పాల్గొంటోంది. ఉపాసన కోరిక మేరకే రామ్‌చరణ్ పోలో టీమ్‌ను కొన్నారని అంటారు. పోటీలు జరుగుతున్నప్పుడు రామ్ చరణ్, ఉపాసన కూర్చుని చూశారు.


Click it and Unblock the Notifications











