రామ్ చరణ్ - ఉపాసనల నిశ్చితార్థం కోటలో కాదు ఫాం హౌస్...?!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 1న ఇద్దరి నిశ్చితార్థం జరుపాలని పెద్దలు నిర్ణయించారు. నిశ్చితార్థ వేడుక ఉపాసన పూర్వీకులు నిర్మించిన దోమకొండ కోటలో జరుగుతుందని అంతా భావించారు. కానీ ఈ వేడుక అక్కడ జరుగడం లేదని తెలుస్తోంది.
మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ వివాహ నిశ్చితార్ధం వేదిక మారుతోంది. మొదట్లో నిజామాబాద్ సమీపంలోని దోమకొండ కోటలో ఈ వేడుక జరుగుతుందని వార్తలొచ్చాయి. అందుకు తగ్గట్టుగా పాడుపడిన ఆ కోటకు యుద్ధప్రాతిపదికన మరమ్మత్తులు కూడా మొదలెట్టారు. అయితే, ఈ ఫంక్షన్ కు దేశవిదేశాల నుంచి వీఐపీలు విచ్చేస్తున్న సందర్భంగా, ఆ ప్రదేశం హైదరాబాదు నగరానికి దూరమవుతుందన్న ఉద్దేశంతోనూ, భద్రతా కారణాల దృష్ట్యాను, తాజాగా వెన్యూను మార్చినట్టు సమాచారం అందుతోంది.
ఈ నేపథ్యంలో హైదరాబాదు శివారులోని మొయినాబాదు దగ్గరలోని ఓ ఫాం హౌస్ ను ఎంపిక చేశారు. ఇప్పుడిక్కడ ఆ వేడుకకు తగ్గా ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. ఈ వేదిక శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు కూడా దగ్గరగా వుండడం కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. రామ్ చరణ్, ఉపాసనల నిశ్చితార్ధం డిసెంబర్ 1 న జరుగుతున్న సంగతి తెలిసిందే!


Click it and Unblock the Notifications











