Manchu Manojకు రామ్ చరణ్ దంపతుల సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ఆ బొమ్మ ధర, స్టోరీ ఏమిటంటే?
బాల నటుడిగా కెరీర్ ప్రారంభించిన మంచు మనోజ్ హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే మోహన్ బాబు రేంజ్ లో మాత్రం అంతగా పేరు తెచ్చుకోలేకపోయాడు. చిన్ననాటి స్నేహితురాలు ప్రణతి రెడ్డిని వివాహం చేసుకున్న మనోజ్ నాలుగేళ్లకు విడాకులు తీసుకున్నాడు. ఇటీవలే భూమా నాగ మౌనిక రెడ్డిని రెండో వివాహం చేసుకున్నాడు ఈ యంగ్ హీరో. అయితే మనోజ్-మౌనిక పెళ్లి కానుకగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులు తాజాగా ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. దాని ఖరీదు, స్టోరీ ఏంటనే వివరాల్లోకి వెళితే..
అనేక సినిమాలు: మేజర్ చంద్రకాంత్, పుణ్యభూమి నాదేశం, అడవిలో అన్న, ఖైదీగారు సినిమాల్లో బాలనటుడిగా నటించిన మంచు మనోజ్ దొంగ దొంగది మూవీతో హీరోగా డెబ్యూ చేశాడు. తర్వాత శ్రీ, రాజు భాయ్, నేను మీకు తెలుసా, ప్రయాణం, బిందాస్, వేదం, ఝుమ్మంది నాదం, మిస్టర్ నూకయ్య, ఊ కొడతారా ఉలిక్కి పడతారా, కరెంట్ తీగ, పాండవులు పాండవులు తుమ్మెద, పోటుగాడు, ఎటాక్, గుంటూరోడు లవ్ లో పడ్డాడు, ఒక్కడు మిగిలాడు సినిమాల్లో నటించాడు.

విడాకులు-రెండో పెళ్లి: ప్రస్తుతం వాట్ ది ఫిష్, మనం మనం బరంపురం వంటి సినిమాల్లో నటిస్తున్నాడు మంచు మనోజ్. సినిమాలు పక్కన పెడితే ఎంతోకాలంగా ప్రేమించి 2015లో పెద్దల సమక్షంలో చిన్ననాటి స్నేహితురాలు ప్రణతి రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థల కారణంగా 2019లో ఈ ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఇటీవలే అంటే మార్చి 3న భూమా నాగ మౌనిక రెడ్డిని రెండో పెళ్లి చేసుకుని మరోసారి వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు.
అక్కతో కలిసి: మంచు మనోజ్ తన మాట తీరుతో సినీ ఇండస్ట్రీలో అనేకమందితో స్నేహంగా ఉంటాడన్న విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలీలోని రామ్ చరణ్ తో కూడా సన్నిహింతగా ఉంటాడు మనోజ్. ఇటీవల రామ్ చరణ్ బర్త్ డే వేడుకలకు మోహన్ బాబు, మంచు విష్ణు ఏదో టూర్ కారణంగా అటెండ్ కాకపోయిన మంచు మనోజ్ మాత్రం హాజరయ్యాడు. అక్క మంచు లక్ష్మీతో కలిసి ఫంక్షన్ లో సందడి కూడా చేశాడు.

ఫొటోలు తీసి: తాజాగా మంచు మనోజ్-మౌనికలకు రామ్ చరణ్-ఉపాసన దంపతులు సర్‌ప్రైజ్ చేశారు. రెండో వివాహం చేసుకున్న మనోజ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ పెళ్లి కానుక పంపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు మంచు మనోజ్. రామ్ చరణ్, ఉపాసన పంపిన గిఫ్ట్ ప్యాక్ ను, దానిలో ఉన్న బహుమతిని ఫొటోలు తీసి మరి ట్విట్టర్ లో షేర్ చేసి సంతోషం వ్యక్తం చేశాడు.
ప్రేమతో ఎం అండ్ ఎం: "ఇలాంటి సర్‌ప్రైజ్ గిఫ్ట్ లు ఎంతో ప్రేమగా కూడుకున్నవి. ఇంత ప్రేమ కురిపించిన అందమైన జంట రామ్ చరణ్, ఉపాసనకు కృతజ్ఞతలు. లవ్ యు మిస్టర్ అండ్ మిసెస్ మిత్రమా. మీరు మాల్దీవుల విహారయాత్ర నుంచి తిరిగి వచ్చిన వెంటనే కలుస్తాను. మీ అద్భుతమైన సమయాన్ని ఎంజాయ్ చేయండి. ప్రేమతో ఎం అండ్ ఎం (మనోజ్, మోనిక)" అని ట్వీట్ లో రాసుకొచ్చాడు మంచు మనోజ్.
రూ. 6 లక్షల వరకు: ఇదిలా ఉంటే రామ్ చరణ్ పంపిన గిఫ్ట్ పై ఆసక్తి నెలకొంది. అందులో ఉన్న బొమ్మను స్పానిష్ సంస్థ లాడ్రో తయారు చేసింది. ఈ బొమ్మ ఖరీదు రూ. 70, 500. కొత్త జంట ఒకరినొకరు చూసుకుంటూ గాలిలో ముద్దాడుకోబోతున్నట్లుగా ఉండే ఈ బొమ్మ స్పెయిన్ లో తయారైంది. గ్లాసీ ఫినిష్ తో ఎంతో అందంగా ఉంది. లాడ్రో సంస్థ తయారు చేసే రూ. 10 వేల నుంచి రూ. 6 లక్షల వరకు గల ధరల బొమ్మలను భారతదేశంలో విక్రయిస్తోంది.


Click it and Unblock the Notifications











