శ్రీమతితో.... శ్రీవారి చెంతకు రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, తన శ్రీమతి ఉపాసనతో కలిసి శనివారం తెల్లవారు ఝామున తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. కొత్త జంట కోసం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజ చేశారు. చిరంజీవి కుటుంబంతో పాటు ఉపాసన కుటుంబ సభ్యులు ప్రత్యేక విమానంలో తొలుత తిరుచారును దర్శించుకుని శుక్రవారం రాత్రి తిరుమల చేరుకున్నారు.
ఈ రోజు జరిగిన శ్రీవారి కళ్యాణ సేవలో రామ్ చరణ్-ఉపాసన పాల్గొన్నారు. అనంతరం ఉపాసన తాత నేటివ్ ప్లేస్ అయిన ఆరగొండకు చేరుకుని అక్క వీరాంజనేయ స్వామి టెంపుల్‌ను దర్శించుకోనున్నారు. అనంతరం అక్కడ కొత్తగా నిర్మాణమైన పాఠశాలను ప్రారంభించడంతో పాటు వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్‌ను ఓపెన్ చేయనున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ...మొక్కలు తీర్చుకోవడానికే తిరుమల వచ్చినట్లు తెలిపారు.
రామ్ చరణ్-ఉపాసన వివాహం ఈ నెల 14న అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. మర్నాడు అభిమానుల కోసం ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసి అభిమానులకు తాము ఎంత ప్రాధాన్యం ఇస్తామో చూపించారు మెగా ఫ్యామిలీ. తన జీవితంలోకి ఉపాసన రాకను అదృష్టంగా భావిస్తున్న చెర్రీ ఇకపై తన కెరీర్ మరింత మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నాడు.
మరో రెండు రోజుల్లో చెర్రీ-ఉపాసన హానీమూన్ ఎంజ్ చేయడానికి ఇండియాలోని ఓ హిల్ స్టేషన్‌కి వెళ్ల బోతున్నారు. అయితే అది ఎక్కడ అనే విషయాన్ని ఇంకా రహస్యంగానే ఉంచారు. హనీమూన్ అనంతరం చెర్రీ యదావిధిగా తన షూటింగులతో బిజీగా కాబోతున్నాడు. ప్రస్తుతం చెర్రీ బాలీవుడ్ మూవీ 'జంజీర్', వంశీ పండిపల్లి దర్శకత్వంలో 'ఎవడు', వినాయక్ దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











