రామ్ చరణ్-ఉపాసన వెడ్డింగ్ కార్డ్
మెగా తనయుడు రామ్ చరణ్ తేజ్, ఉపాసన కామినేని వివాహం జూన్ 14న జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుక కోసం కళ్లు చెదిరేలా వెడ్డింగ్ కార్డు తయారు చేయించారు మెగా ఫ్యామిలీ. కార్డుపై ప్రత్యేకంగా 'కొణిదిదెల' ఫ్యామిలీ అనే లోగోను తయారు చేయించారు. ఫ్రంట్ సైడ్ చిరంజీవి(హనుమాన్ భగనవాన్) ఫోటోతో ఆకర్షణీయంగా ఈ కార్డును డిజైన్ చేశారు.

రామ్‌చరణ్ , ఉపాసనల పెండ్లి పత్రికను తిరుమలేశుని పాదాల చెంత ఉంచి ఆశీస్సులు పొందారు. రామ్‌చరణ్ తేజ తల్లి సురేఖ తొలిపత్రికను తిరుమలేశునికి సమర్పించారు. అలాగే శ్రీవారి పాదాలు, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పాదాల వద్ద ఉంచి పూజించారు.
ఇటు చరణ్ కుటుంబంతో పాటు, అటు ఉపాసన కుటుంబం కూడా బాగా ధన వంతులు. పైగా రాజకీయంగా, సీనీ రంగంలో భాగా పలుకు బడి ఉన్న వారు. ఈ నేపథ్యంలో తమ ముద్దుల వారసులు రామ్ చరణ్, ఉపాసన వివాహం దేశ చరిత్రలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఈ వెంట్‌గా నిర్వహించేందుకు ఇరు కుటుంబాల వాళ్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుక కోసం కోట్ల రూపాయలను నీళ్లలా ఖర్చు పెట్టేస్తూ కనీ వినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











