ఘనంగా వెంకటేష్ కూతురు వెడ్డింగ్: రానాతో కలిసి రాంచరణ్ ఉపాసన రచ్చ.. పెళ్లి జంట ఫొటో ట్వీట్

Recommended Video

Rana, Samantha And Naga Chaitanya To Kickstart Grand Sangeet @ Venkatesh's Daughter Wedding

దగ్గుబాటి నట వారసుడు, విక్టరీ వెంకటేష్ కూతురు ఆశ్రిత వివాహం జైపూర్‌లో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి కోసం ఇప్పటికే బాలీవుడ్, దక్షిణాది ప్రముఖులు జైపూర్‌లో పోటెత్తారు. ఈ పెళ్లి కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. రానా దగ్గుబాటి ఏర్పాట్లును దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ పెళ్లికి హాజరైన రాంచరణ్, ఉపాసన దంపతులు వివాహానికి సంబంధించిన ఫొటోలు ట్వీట్ చేశారు. పెళ్లి విశేషాలు మీకోసం..

కంగ్రాట్స్ అంటూ ఉపాసన దంపతులు

కంగ్రాట్స్ అంటూ ఉపాసన దంపతులు

కంగ్రాట్యులేషన్ వెంకీ అంకుల్, నీరు అంటీ. కొత్త దంపతులు అశ్రిత, వినాయక్‌కు పెళ్లి శుభాకాంక్షలు. మీ వైవాహిక జీవితం నూరేళ్లపాటు చక్కగా కొనసాగాలి అని ఉపాసన ట్వీట్ చేశారు.

రానాతో కలిసి రచ్చ చేసి మిస్టర్ సీ

రానాతో కలిసి రచ్చ చేసి మిస్టర్ సీ

రానా, మిస్టర్ సీ (రాంచరణ్) కలిసి రచ్చ చేస్తున్నాం. పెళ్లి వేడుక చాలా బాగా జరిగింది. జైపూర్‌కు కొత్త కళ వచ్చేసింది అంటూ ఉపాసన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అశ్రిత వివాహం జైపూర్‌లో మార్చి 24న తేదీన జరిగిన విషయం తెలిసిందే.

వెంకటేష్ దంపతులతో కలిసి

అశ్రిత, వినాయక్ పెళ్లి సందర్భంగా నూతన వధూవరులు అశ్రిత, వినాయక్ రెడ్డి, వెంకటేష్ దంపతులతో కలిసి రాంచరణ్ దంపతులు ఫొటో దిగారు. అలాగే రానాతో కలిసి దిగిన ఫొటోలను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. చరణ్‌తో దిగిన ఫొటోను ఉపాసన ట్వీట్ చేసింది.

 రాజస్థానీ, హిందూ వివాహ పద్దతిలో

రాజస్థానీ, హిందూ వివాహ పద్దతిలో

వెంకటేష్ కూతురు అశ్రిత వివాహం హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ రామసహాయం సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో జైపూర్‌లో మార్చి 24న జరిగింది. ఈ పెళ్లి కోసం, అతిథుల బస కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. హిందీ, దక్షిణాది సినిమా ప్రముఖులు భారీగా హాజరయ్యారు. ఈ పెళ్లిని రాజస్థానీ స్టయిల్‌లో హిందూ మతాచారం ప్రకారం జరిపించేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిసింది.

 జైపూర్‌లో టీమ్ సల్మాన్ ఖాన్

జైపూర్‌లో టీమ్ సల్మాన్ ఖాన్

బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్, ఆయనతో మైనే ప్యార్ క్యో కియా చిత్రంలో నటించిన బినా కక్, సల్మాన్ స్నేహితుడు.. గాయకుడు కమల్ ఖాన్ పెళ్లికి హాజరయ్యారు. వీరిద్దరిని సంగీత్ కోసం ప్రత్యేకంగా పిలిపించినట్టు తెలిసింది.

సమంత, చైతూ హల్‌చల్

సమంత, చైతూ హల్‌చల్

శనివారం ఉదయమే జైపూర్‌కు చేరుకొన్న సమంత, నాగచైతన్య అశ్రిత వివాహంలో ఆకర్షణగా నిలిచారు. వెడ్డింగ్ చిల్లింగ్ అంటూ తమ సోషల్ మీడియాలో ఫొటోను పోస్టు చేశారు. గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో సంగీతం కోసం ప్రత్యేకంగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X