అక్కడ మెగాస్టార్ ‘చిరు’కి లేనంత క్రేజ్ బన్నీకుంది...

By Sindhu

ఆర్య సినిమాతో తెలుగులోనే కాకుండా మలయాళంలో కూడా అభిమానులను సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. ఆ సినిమా తరవాత బన్ని సినిమాలు మలయాళం లో విడుదల కావడం ఓ ఆనవాయితీ అయ్యింది. అలా బన్ని అక్కడ తన కంటూ ఒక బ్రాండ్ ను ఏర్పరుచుకున్నాడు. మలయాళ మీడియా కూడా అతన్ని 'మల్లు అర్జున్' అని పిలుస్తుంది. అక్కడ చిరంజీవి తెలియని వారికీ కూడా అల్లు అర్జున్ తెలుసంటా. అందుకని ప్రస్తుతం ఆ బ్రాండ్ ను తన సినిమాకు ఉపయోగించు కుంటున్నాడు రామ్ చరణ్.

రామ్ చరణ్ అల్ టైం సూపర్ హిట్ 'మగధీర' సినిమాను 'ధీర' పేరుతొ మలయాళం లోకి అనువదించారు. ఇప్పుడు ఆ సినిమా ప్రచారంలో బాగంగా అల్లు అర్జున్ పేరును ఉపయోగించుకుంటున్నారు. ధీర సినిమాకు అల్లు అర్జున్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. మలయాళ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించటానికి పోస్టర్స్ లో బన్నీ ఫోటోలు వాడుతున్నారు. ఈ విధం గా మల్లువుడ్ లోకి అరంగేట్రం చేస్తున్న రామ్ చరణ్ భవిష్యత్తు అక్కడ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X