The India House: వి మెగా పిక్చర్స్ లో మొదట్లోనే అదిరిపోయే కాన్సెప్ట్..ఆ బ్యాక్ డ్రాప్ లో నిఖిల్ మూవీ
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ యూవీ క్రియేషన్స్ విక్రమ్ తో కలిసి వి మెగా పిక్చర్స్ బ్యానర్ ని స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రొడక్షన్ హౌస్ లో టాలెంటెడ్ దర్శకులతో మూవీస్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అలాగే రెగ్యులర్ జోనర్ కాకుండా కంటెంట్ బేస్డ్ ఇంటరెస్టింగ్ కథలని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగా మొదటి ప్రాజెక్ట్ గా నిఖిల్ సిద్ధార్ద్ తో సినిమాని స్టార్ట్ చేశారు.
అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ తో కలిసి రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీకి సంబందించిన టైటిల్ మోషన్ పోస్టర్ ని రామ్ చరణ్ లాంచ్ చేశారు. ది ఇండియా హౌస్ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కబోతోంది. వంశీ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

స్వాతంత్ర్య ఉద్యమానికి ముందు 1905లో లండన్ లో ఇండియన్ స్టూడెంట్స్ ఫారిన్ చదువుల కోసం ది ఇండియా హౌస్ ని నడిపేవారు. ఆ సమయంలో ఇండియా హౌస్ లో స్టూడెంట్ ఉద్యమం నడిచింది. అయితే ఇండియన్ చరిత్ర పుస్తకాలలో ఎక్కడా కూడా దీని గురించి రాయబడలేదు. అలాంటి ఓ ఇంటరెస్టింగ్ రియల్ స్టొరీని ది ఇండియా హౌస్ మూవీలో చూపించబోతున్నారు.
పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉండటం విశేషం. వీర్ సవార్కర్ జయంతి సందర్భంగా ఈ మోషన్ పోస్టర్ ని లాంచ్ చేయడం విశేషం. ఇక ఈ మూవీలో హీరో క్యారెక్టర్ పేరు శివ కాగా, మూవీ టైటిల్ క్రింద జై మాతాజీ అనే క్యాప్షన్ ఇచ్చారు. దీనిని బట్టి రిలీజియన్ ఎలిమెంట్ ని అంతర్లీనంగా మూవీలో చర్చించబోతున్నారని తెలుస్తోంది.
ఇక ఈ మూవీ లవ్ స్టొరీ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని కూడా క్లారిటీ ఇచ్చారు. ఇక మోషన్ పోస్టర్ చివర్లో ది ఇండియా హౌస్ మంటల్లో దగ్ధం అవుతున్న దృశ్యాలు ప్రెజెంట్ చేసి హీరో క్యారెక్టర్ ని రివీల్ చేశారు. ఇక మోషన్ పోస్టర్ బట్టి కచ్చితంగా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యే ప్రాజెక్ట్ గానే ఈ మూవీ ఉండబోతోందని తెలుస్తోంది. మొత్తానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన కొత్త ప్రొడక్షన్ లో మొదటి సినిమాని ఇలాంటి సబ్జెక్ట్ ని ఎంచుకోవడం సాహసమనే చెప్పాలి.


Click it and Unblock the Notifications











