రచ్చ తర్వాత రామ్ చరణ్ చేసే సినిమా అదే కావచ్చు..!?
వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ చిత్రం చేయనున్నారు. ప్రభాస్ తో 'మున్నా"చేసిన వంశీ పైడిపల్లి మళ్ళీ దిల్ రాజు బేనర్ లోనే ఎన్టీఆర్ తో 'బృందావనం" చేసి సూపర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు రామ్ చరణ్ తో మరో హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు. ఆ మధ్య 'రచ్చ" షూటింగ్ లో వున్న రామ్ చరణ్ కి వంశీ ఒక కథ చెప్పాడట.
వంశీ చెప్పిన కథకి బాగా ఇన్ స్పైర్ అయిన చరణ్ వెంటనే ఓకే చెప్పాడని సమాచారం. అప్పటి నుంచి సబ్జెక్ట్ మీదే వర్క్ చేసిన వంశీ టోటల్ గా స్ర్కిప్ట్ వర్క్ కంప్లీట్ చేశాడట. రామ్ చరణ్ 'రచ్చ" షూటింగ్ పూర్తికాగానే వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో సినిమా స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఎమ్మేల్యే గంటా శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.


Click it and Unblock the Notifications











