రామ్‌చరణ్ సినిమాపై దిల్ రాజు కాన్ఫిడెన్స్
రామ్‌చరణ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు ఓ చిత్రాన్ని నిర్మించనున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ మా బేనర్‌లో రెండు హిట్ చిత్రాలను ఇచ్చిన వంశీ పైడిపల్లి చెప్పిన కథ వినగానే నాకు బాగా నచ్చింది. రామ్‌చరణ్ కూడా ఈ కథ విని ఎక్సయిట్ అయ్యారు.
కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులేసే రామ్‌చరణ్ ఈ కథపై చాలా నమ్మకం వుంచి అంగీకరించారు. ప్రస్తుతం ఈ కథ ఫైనల్ స్టేజ్‌లో ఉంది. ఈ కథ మెగా అభిమానుల అంచనాలకు తగ్గ విధంగా ఉండటంతో పాటు మా సంస్థ నుంచి వచ్చే చిత్రాలకు తగ్గకుండా ఉంటుంది. అన్ని వర్గాలవారిని అలరించే విధంగా ఈ చిత్రం ఉంటుంది అన్నారు. వంశీ పైడిపల్లి మాట్లాడుతూ ఈ సంస్థలో నాకిది మూడో సినిమా. ఇది అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ కావడం ఆనందంగా ఉంది. అందరి అంచనాలను చేరుకునే విధంగా ఈ కథని తయారు చేశాం అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.


Click it and Unblock the Notifications











