రామ్ చరణ్-వెంకటేష్ మల్టీస్టారర్ హీరోయిన్లు వీరేనా?
హైదరాబాద్: విక్టరీ వెంకటేష్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో త్వరలో తెలుగులో మరో భారీ మల్టీ స్టారర్ సినిమా తెరరెక్కబోతున్న సంగతి తెలిసిందే. క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈచిత్రంలో హీరో హీరోయిన్లుగా నయనతార, కాజల్ అగర్వాల్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట.
గతంలో వెంకీ-నయతార లక్ష్మి, తులసి చిత్రాల్లో నటించారు. రామ్ చరణ్-కాజల్ మగధీర, నాయక్ చిత్రాల్లో నటించారు. వీరి మధ్య ఆయా చిత్రాల్లో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఈ నేపథ్యంలో వారిద్దరినీ హీరోయిన్లుగా తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమాపై ఓ రూమర్ కూడా ప్రచారంలో ఉంది. ఈ చిత్రం స్టోరీ లైన్ హిందీ మూవీ 'కభి ఖుషీ కభి ఘమ్' స్టోరీని పోలి ఉంటుందట. ఏది ఏమైనా సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఈ చిత్రాన్ని నిర్మాత బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై నిర్మించనున్నారు. అక్టోబర్ నెలలో ఈచిత్రం ప్రారంభం కానుంది.
ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోల మల్టీ స్టారర్ల ట్రెండ్ ఊపందుకుంది. ఇప్పటికే వెంకటేష్-మహేష్ బాబు మల్టీ స్టారర్‌గా వచ్చిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం మంచి విజయం సాధించింది. మరో వైపు వెంకటేష్-రామ్ మల్టీ స్టారర్ కూడా తెరకెక్కుతోంది. ఇప్పుడు వెంకటేష్-రామ్ చరణ్ మల్టీ స్టారర్ కూడా ఫైనలైజ్ అయింది. వెంకటేష్ తనకోసం ఇలాంటి మల్టీస్టారర్ స్టోరీలు అడిగి మరీ తయారు చేయించుకుని, యంగ్ హీరోలతో చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.


Click it and Unblock the Notifications











