»   » మహేష్ గురించి వెంకీ, చెర్రీ, పూరి, త్రివిక్రమ్ (ఫోటోలు)

మహేష్ గురించి వెంకీ, చెర్రీ, పూరి, త్రివిక్రమ్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : టాలీవుడ్లో అందగాడు ఎవరంటే ఎవరైనా సరే ముందు చెప్పే పేరు సూపర్ స్టార్ మహేష్ బాబు పేరే. మిల్కీ బాయ్‌గా, అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు సంపాదించుకున్నమహేష్ బాబును మించిన అందగాడు ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎవరూ లేరనే చెప్పొచ్చు.

ఈ రోజు మహేష్ బాబు పెట్టినరోజు జరుపుకుంటున్నారు. నేటితో ఆయన 37 సంవత్సరాలు పూర్తి చేసుకుని 38వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో '1'(నేనొక్కడినే) సినిమా చేస్తున్న మహేష్ షూటింగులో భాగంగా లండన్లో ఉన్నారు. అక్కడే పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నారు.

మహేష్ బాబు పుట్టిన రోజును పురస్కరించుకుని పలువురు సెలబ్రిటీలు మహేష్ బాబుపై తమ అభిప్రాయాన్ని ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

రామ్ చరణ్

రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా మహేష్ బాబు అందాన్ని పొగిడేస్తున్నాడు. మహేష్ బాబు అందమైన నటుడు అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. మహేష్ బాబు నుంచి తాను కొరుకునేది ఏమిటంటే....అందమే అంటున్నాడు ఈ యువ హీరో. అంతకాదండో మహేష్ బాబు సహజంగా నటిస్తాడని కితాబిస్తున్నాడు.

వెంకటేష్

వెంకటేష్

మహేష్ బాబు గురించి వెంకటేష్ మాట్లాడుతూ...సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో ఇద్దరం కలిసి నటించాం. సెట్లో నాకు నిజంగానే తమ్ముడిలా కనిపించేవాడు. పాత్రలోకి తొందరగా వెళ్లి పోతాడు, పనిమీద అతని నిబద్దత నాకు నచ్చింది అన్నారు.

పూరి జగన్నాథ్

పూరి జగన్నాథ్

మహేష్ బాబు గురించి పూరి జగన్నాథ్ మాట్లాడుతూ...నేను రాసిన సంభాషణలకు మరింత బలం తీసుకొచ్చిన కథానాయకుడు మహేష్ బాబు. పది పైసల డైలాగును రూపాయిగా మారుస్తారు. నటిస్తున్నట్లు నాకెప్పుడూ అనిపించలేదు. కట్ చెప్పడం మరిచి పోయిన సందర్భాలూ ఉన్నాయి అన్నారు.

త్రివిక్రమ్

త్రివిక్రమ్

మహేష్ బాబు నాకు ఎప్పుడూ నటిస్తున్నట్లు అనిపించనేలేదు. సహజంగా నిటిస్తాడు. అతని వల్ల పాత్రకు సరికొత్త శక్తి వస్తుంది. తనతో రెండు సినిమాలు చేసా. అతడులో చాలా తక్కువ మాట్లాడతాడు. అన్నీ పోగేస్తే అతని కోసం రాసిన డైలాగులు మూడు పేజీలకు మించవు. డబ్బింగ్ కూడా రెండు మూడు గంటల్లో ముగిసి పోయింది. ఖలేజా సినిమాలో పాత్రల్లో వైవిద్యం బాగా చూపించాడు అని చెప్పుకొచ్చారు త్రివిక్రమ్

కాజల్

కాజల్

మహేష్ బాబు గురించి కాజల్ మాట్లాడుతూ...సినిమా అంతా తన భుజాలపై వేసుకుని నడిపించగలడు. సన్నివేశాన్ని చాలా తొందరగా అర్థం చేసుకుంటాడు. రీటేకులూ తక్కువే. అందుకే ఆయనతో నటించే వారు ఎవరైనా జాగ్రత్తగా ఉండాల్సిందే అని వెల్లడించారు.

English summary

 Charan, Venkatesh, Puri, Trivikram's comments on Tollywood super star Mahesh Babu. Mahesh Babu turns 38 today. Mahesh Babu is an Indian film actor best known for his work in Telugu cinema.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu