twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సీక్రెట్ గా రామ్ చరణ్ కొత్త చిత్రం లాంచింగ్

    By Srikanya
    |

    దర్శకుడు వివి వినాయిక్, హీరో రామ్ చరణ్ కాంబినేషన్ లో రూపొందే చిత్రం లాంచింగ్ ఓ నాలుగు రోజుల క్రితం సైలెంట్ గా వాళ్ల ఆఫీసులోనే జరిగింది.పూజతో ఈ ప్రారంభం చేసారు. నిర్మాత, దర్శకుడు, హీరో, మరో నలుగురైదురు ఈ లాంచింగ్ కి హాజరయ్యారు. అయితే ఫార్మల్ లాంచింగ్ కాబట్టి ఏ హడావిడి లేకుండా జరిపేసారు.డి వివి దానయ్య నిర్మించే ఈ చిత్రంలో కాజల్ ని హీరోయిన్ గా ఎంపిక చేసారు.మరో హీరోయిన్ ని ఇంకా ఎంపిక చేయలేదు.గతంలో వినాయిక్ లక్ష్మి చిత్రానికి కథ అందించిన ఆకుల శివ ఈ చిత్రానికి స్క్రిప్టు అందిస్తున్నారు.కోన వెంకట్ డైలాగులు రాస్తున్నారు.అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందనుందని చెప్తున్నారు.జనవరి నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూట్ జరగనుంది.ఆగస్టులో చిత్రం విడుదల చేస్తారు.ఆ తర్వాత దిల్ రాజు బ్యానర్ లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో జరిగే షూటింగ్ లో రామ్ చరణ్ పాల్గొంటారు.ప్రస్తుతం రామ్ చరణ్ రచ్చ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.రచ్చ చిత్రాన్ని పిబ్రవరి ఇరవై వ తేదీన విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

    ఇక రచ్చ గురించి రామ్ చరణ్ చెపుతూ..నేను చాలా ఎగ్జైట్మెంట్ తో ఉన్నాను..అలాంటి పాత్రను నేను ఎప్పుడూ ఊహించుకోలేదు. నా ఫ్యాన్స్ నానుంచి ఎలాంటి సినిమా ఎక్సపెక్ట్ చేస్తారో ఖచ్చితంగా అలాంటిదే ఇది.ఈ స్క్రిప్టుని సంపత్ నంది చాలా జాగ్రత్తగా వర్క్ చేసి తెరకెక్కిస్తున్నారు. అతను చాలా ప్రతిభావంతంగా పనిచేస్తున్నాడు అన్నారు. పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంకోసం రామ్ చరణ్ మియామి, అమెరికలో మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. తమన్నా రామ్ చరణ్ తో జోడికడుతున్న ఈ సినిమాలో చరణ్ మిడిల్ క్లాస్ కుర్రాడుగా పక్కా మాస్ పాత్రను చేస్తున్నారు.దేవి శ్రీ ప్రసాద్ 'రచ్చ'సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తోందిది.

    English summary
    Ram Charan is going to do his next film under VV Vinayak’s direction. The formal launch of this film will be done on this Wednesday with a puja ceremony. DVV Danaiah will produce this film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X