రామ్ చరణ్, వినాయిక్ చిత్రం స్టోరీ లైన్
రామ్ చరణ్, వివి వినాయిక్ కాంబినేషన్ లో యూనివర్సల్ మీడియా సంస్థ నిర్మిస్తున్న చిత్రం నిన్న (బుధవారం)ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కథ... తండ్రికిచ్చిన మాట కోసం తనయుడు ఏం చేశాడనే పాయింట్ చుట్టూ తిరుగుతుంది. చిన్నపాటి టెన్షన్ తోపాటు మంచి యాక్షన్ సీన్స్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ ఏ మాత్రం తగ్గని సినిమా. దర్శకుడు వినాయక్ చిత్రం గురించి చెబుతూ ''చిరంజీవిగారితో 'ఠాగూర్' తీసిన రోజులు గుర్తొస్తున్నాయి. చిత్రీకరణ ఎప్పుడు ప్రారంభిస్తామో త్వరలో చెబుతాం. యువరాజు పెళ్లి ఉంది కదా? దానికి ముందా? తరవాత? అనేది ఇంకా నిర్ణయించలేదు. తప్పకుండా అందరినీ మెప్పించే సినిమా తీస్తామని అన్నారు.
రామ్ చరణ్ మాట్లాడుతూ ''మా అమ్మని ఎన్నిసార్లు అడిగినా రాలేదు. ఫస్ట్ టైమ్ తను వచ్చి, క్లాప్ ఇచ్చింది. చాలా చాలా ఆనందంగా ఉంది. నాన్నగారితో 'ఠాగూర్" లాంటి మంచి సినిమా తీశారు వినాయక్‌గారు. దానయ్యగారు కూడా మంచి సినిమాలు తీసిన నిర్మాత. వారి కాంబినేషన్‌లో సాగిపోయే మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది" "అని రామ్‌చరణ్ అన్నారు. ఈ సినిమాకి తను ఇచ్చిన కథ కుదరడం ఆనందంగా ఉందని రచయిత ఆకుల శివ చెప్పారు. కథ, మాటలు: ఆకుల శివ, సమర్పణ: ఎస్. రాధాకృష్ణ (చినబాబు).


Click it and Unblock the Notifications











