మెగా సెంటిమెంట్: కోల్‌కతాకు రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వచ్చే శుక్రవారం కోల్‌కతా వెలుతున్నారు. అక్కడ వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు. జులై 20 నుంచి అక్కడ ఈ చిత్రం కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈచిత్రంలో చెర్రీ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. యాక్షన్ అండ్ కామెడీ నేపథ్యంలో ఆయన పాత్రలు ఉంబోతున్నాయి.
రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్, అమలపాల్ నటిస్తున్నారు. ఇందులో బ్రహ్మానందం జిలేబీ పాత్రలో నవ్వులు పండించనున్నారు. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య యూనివర్సల్ మీడియా బ్యానర్‌పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.
మెగా ఫ్యామిలీకి కోల్‌కతా ఓ సెంటిమెంటు ప్లేసుగా కొనసాగుతూ వస్తోంది. గతంలో చిరంజీవి నటించిన పలు సూపర్ హిట్ చిత్రాలతో పాటు, పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాలు కోల్‌కతాలో చిత్రీకరించారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్‌కు కోల్‌కతా సెంటిమెంటు కలిసొస్తుందనే నమ్మకం మెగా వర్గాల్లో వినిపిస్తోంది.
చరణ్ నటిస్తున్న బాలీవుడ్ మూవీ 'జంజీర్' కొన్ని రోజులుగా బ్యాంకాక్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. అక్కడ షూటింగ్ ముగిసిన అనతరం రామ్ చరణ్ హైదరాబాద్ చేరుకుంటున్నారు. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్. అమితాబ్ హీరోగా వచ్చిన 'జంజీర్' చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతోంది.


Click it and Unblock the Notifications











