దుబాయి పబ్ లో రామ్ చరణ్ ఆట, పాట...
యూనివర్సల్ మీడియా పతాకంపై రామ్‌చరణ్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కాజల్, అమలాపాల్ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. డి.వి.వి.దానయ్య నిర్మాత. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతోంది. పబ్ నేపథ్యంలో సాగే ఓ గీతాన్ని రామ్‌చరణ్‌పై తెరకెక్కిస్తున్నారు. జానీ నృత్యరీతులు సమకూరుస్తున్నారు. ఐదు రోజులపాటు అక్కడే చిత్రీకరణ జరుగుతుంది.
ఈ విషయమై నిర్మాత మాట్లాడుతూ ''మెగా అభిమానులు తమ హీరోని ఎలా చూడాలనుకొంటారో బాగా తెలిసిన దర్శకుడు వినాయక్. అటు మాస్‌నీ, ఇటు క్లాస్‌నీ అలరించేలా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రామ్‌చరణ్ పాత్రని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. తెరపై చరణ్ భిన్నమైన కోణాల్లో కనిపిస్తారు. కథాబలమున్న చిత్రమిది. 'మగధీర' తర్వాత చరణ్, కాజల్ కలిసి ఇందులో నటిస్తున్నారు. తమన్ అందించిన స్వరాలు చాలా బాగున్నాయి''అన్నారు.
ఈ చిత్రంలో రామ్ చరణ్ ఇంజినీరింగ్ కాలేజికి పోనున్నారని తెలుస్తోంది. హైదరాబాద్ లోని శ్రేయా ఇండినీరింగ్ కాలేజీలో ఈ చిత్రం షూటింగ్ జరుగింది. అలాగే ఫ్యామిలీ డ్రామా గా చెప్పబడుతున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం ఎక్కువ భాగం ఉంటాడని తెలుస్తోంది. బ్రహ్మి డేట్స్ ఎక్కువ తీసుకోవటంతో ఈ వార్త బయిటకు వచ్చింది. ప్రేక్షకులు నన్ను ఎలా చూడాలనుకొంటున్నారో బాగా తెలిసిన దర్శకుడు వి.వి.వినాయక్. అటు మాస్‌నీ, ఇటు యువతనీ సమంగా మెప్పిస్తారు. పూర్తిస్థాయి మాస్ అంశాలున్న చిత్రమిది. నా పాత్ర భిన్న కోణాల్లో కనిపిస్తుంది. మగధీర తరవాత కాజల్‌తో చేస్తున్న చిత్రమిది. చక్కటి సంగీతం తోడైందని రామ్ చరణ్ అన్నారు.
ఈ చిత్రాన్ని యూనివర్శల్ మీడియా సంస్థ నిర్మిస్తోంది. కాజల్ హీరోయిన్ గా చేస్తున్న ఈచిత్రానికి డి.వి.వి.దానయ్య నిర్మాత. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రాహుల్‌దేవ్, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్ రావత్, సత్యం రాజేష్, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, సంగీతం: తమన్.


Click it and Unblock the Notifications











