పందెం కోళ్లలా తలపడుతున్న చరణ్-ఎన్టీఆర్!
హైదరాబాద్ : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మరోసారి బాక్సాఫీట్ ఫైట్‌కు సిద్ధం అవతున్నారు. ఈ సారి సంక్రాంతి పండగక్కి పందెం కోళ్లలా కత్తులు దూసుకునేందుకు రెడీ అవుతున్నారు. జూ ఎన్టీఆర్ నటిస్తున్న 'బాద్ షా' చిత్రం జనవరి 11న విడుదలవుతుండగా...వారం గ్యాప్‌తో రామ్ చరణ్ నటిస్తున్న 'నాయక్' చిత్రం రిలీజ్‌కి రెడీ అవుతోంది.
ఈ ఇద్దరు హీరోలు సమ్మర్ బరిలో పోటీ పడ్డ విషయం తెలిసిందే. ఎన్టీఆర్ నటించిన 'దమ్ము'...చరణ్ నటించిన 'రచ్చ' చిత్రాలు రెండు వారాల గ్యాప్‌తో విడుదలయ్యాయి. అయితే దమ్ము చిత్రం బాక్సాఫీసు వద్ద తడబడగా, రచ్చ చిత్రం సూపర్ హిట్ అయి కలెక్షన్ల విషయంలో రచ్చ సృష్టించింది.
అయితే ఈసారి ఈ ఇద్దరు మళ్లీ పోటీకి సిద్ధం అవడం, విడుదల గ్యాప్ కూడా తక్కువగా ఉండటంతో ఈ సారి ఎవరిది పై చేయి అవుతుందోనని సినీ అభిమానులు, ఫిల్మ్ ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాద్ షా చిత్రంపై జూ ఎన్టీఆర్ పూర్తి కాన్ఫిడెంట్ గా ఉండగా, నాయక్ తనను మరింత టాప్ రేంజికి తీసుకెలుతుందని చరణ్ నమ్మకంతో ఉన్నాడు.
బాద్ షా చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తుండగా పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై బండ్ల గణేష్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన కాజల్ నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. రామ్ చరణ్ నాయక్ చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా కాజల్ అగర్వాల్, అమలా పాల్ హీరోయిన్లు. మరి ఈ ఇద్దరిలో సంక్రాతి హీరో ఎవరో తేలియాలంటే పండగ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











