వివి వినాయక్ డైరక్షన్ లో రామ్ చరణ్ సినిమా టైటిల్...!?
గతంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముద్దు పేరు 'బన్నీ' పేరుతొ సినిమా తీసి హిట్టు కొట్టిన వివి వినాయక్ ఇప్పుడు రామ్ చరణ్ ముద్దు పేరు 'చెర్రీ' ని వారిద్దరి కలయికలో వస్తున్నా కొత్త చిత్రానికి టైటిల్ గా నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని నిర్మించ తలపెట్టిన యూనివర్సల్ మీడియా బ్యానర్ ఫై 'చెర్రీ' అనే టైటిల్ ఫిలిం చాంబర్లో నమోదైంది. దీనిని బట్టి ఈ సినిమాకు 'చెర్రీ' పేరును ఖరారు చేసినట్టు అర్ధం అవుతుంది.
ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన డిస్కషన్స్, కధ చర్చలు జరుగుతున్నా ఈ చిత్రాన్ని కుటుంబ నేపద్యంలో సాగే యాక్షన్ సినిమాగా చెప్పుకొస్తున్నారు. ఈ సినిమాలో అత్త పాత్రకు చాలా ప్రాధాన్యం ఉన్నట్టు తెలుస్తుంది. ఆ పాత్రలో ఓ ప్రముఖ నటిని నటింప చేసే ప్రయత్నాలు జరిగుతున్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన సమంత హీరోయిన్ గా నటించనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనున్నాడు. యూనివర్సల్ మీడియా బ్యానర్ ఫై డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ లో సెట్స్ ఫై కి వెళ్ళనుంది.


Click it and Unblock the Notifications











